‘మహానటి’లో మంచు వారి పాప

manchu-lakshmi-daughter-playing-savitris-child-role

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులు ఎల్లకాలం గుర్తించుకునే హీరోయిన్‌ సావిత్రి. మొదటి తరం హీరోయిన్‌గా మహానటి సావిత్రికి పేరు ఉంది. ఆమె జీవితంలో కొన్ని చీకటి కోణాలు కూడా ఉన్నాయి. ఆ చీకటి కోణాలను వెలుగులోకి తీసుకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. అదే ‘మహానటి’ చిత్రం. అశ్వినీదత్‌ నిర్మాణంలో ఆయన అల్లుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘మహానటి’ చిత్రం తెరకెక్కుతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ అంటే సావిత్రి పాత్రను కీర్తి సురేష్‌ పోషిస్తూ ఉండగా, ఒక ముఖ్యమైన పాత్రలో సమంత కనిపించబోతుంది. దుల్కర్‌ సల్మాన్‌ జెమిని గణేషన్‌ పాత్రను పోసిస్తున్నాడు. ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇదే సినిమాలో మంచు వారి అమ్మాయి కూడా కనిపించబోతుంది.

మంచు వారి అమ్మాయి అనగానే మంచు లక్ష్మి అనే ఆలోచన మీకు రావచ్చు. కాని ఈ చిత్రంలో కనిపించబోతున్నది మంచు లక్ష్మి కాదు, ఆమె కూతురు నిర్వాన. అవును ‘మహానటి’ చిత్రంలో మంచు ఆనంద్‌ నిర్వానను చూపించబోతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సావిత్రి చిన్నప్పటి సీన్స్‌ కొన్ని చిత్రీకరించనున్నారు. ఆ సీన్స్‌ కోసం అంటే సావిత్రి చిన్నప్పటి పాత్ర కోసం నిర్వానను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం నాలుగు లేదా అయిదు నిమిషాల పాటు నిర్వాన స్క్రీన్‌ప్లే కనిపించబోతుంది. అయినా కూడా ప్రేక్షకుల అమితాశక్తికని కనబర్చే అవకవశం ఉంది. ఆ చిన్న పాత్రకు ఎవరినైనా తీసుకోవచ్చు. కాని మంచు వారి అమ్మాయి అయితే సినిమాకు మరింత క్రేజ్‌ పెరుగుతుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

నా భర్త పరమ నీచుడు..!

నిఖిల్ పెళ్లి కొడుకు అవుతున్నాడోచ్.