నా భర్త పరమ నీచుడు..!

singer-kousalya-talks-about-her-divorce

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సింగర్‌ సునీత గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమా ప్రేక్షకులందరికి కూడా సునిత సుపరిచితురాలు. ఆమె వైవాహిక జీవితం చాలా కష్టాల్లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఆమె భర్త నుండి చాలా సంవత్సరాలుగా దూరంగా ఉంటూ, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిసి భర్త నుండి దూరంగా ఉంటుంది. ఇంకా విడాకులు తీసుకోకున్నా ఆమెకు ఇకపై భర్తతో కలిసి జీవితాన్ని పంచుకునే ఆలోచన లేదు. ఇప్పుడు సునీత దారిలోనే మరో ప్రముఖ సింగర్‌ కౌసల్యం కూడా భర్త నుండి దూరం అవ్వాలని నిర్ణయించుకుంది.

తాజాగా ఒక వెబ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సింగర్‌ కౌసల్య తన వైవాహిక జీవితంపై  మొదటి సారి నోరు విప్పింది. తన జీవితం పెళ్లి తర్వాత నాశనం అయ్యిందని చెప్పుకొచ్చింది. జీవితంలో ఇలాంటి రోజులు ఎదుర్కోవాల్సి వస్తుందని తాను ఎప్పుడు ఊహించలేదు అని, తన భర్త పరమ నీచుడు. ఆయన నా జీవితాన్ని పెళ్లి తర్వాత పూర్తిగా మార్చేశాడు. పెళ్లి అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అతడు నన్ను చిత్ర హింసలు పెడుతూనే ఉన్నాడు. ఎన్ని కష్టాలు అనుభవించాను నాకు మాత్రమే తెలుసు. ఆరు సంవత్సరాలుగా పలు సార్లు చనిపోవాలనిపించింది అంటూ కౌసల్య చెప్పుకొచ్చింది. అందుకే ఇక అతడితో జీవితాన్ని కొనసాగించడం సాధ్యం కాని విషయం అని విడాకులు ఇచ్చేందుకు సిద్దం అయ్యాను. నన్ను ఎన్నో సార్లు దారుణంగా కొట్టడంతో పాటు, నాకు ఫోన్‌ చేసి ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం, అసహ్యంగా మెసేజ్‌లు పెట్టడం చేసేవాడు అని కౌసల్య చెప్పుకొచ్చింది. త్వరలోనే విడాకులు తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అని ఆమె పేర్కొంది.

మరిన్ని వార్తలు:

నిఖిల్ పెళ్లి కొడుకు అవుతున్నాడోచ్.

లవకుమార్‌ అంధుడు!

తెలుగు బిగ్‌బాస్‌కు తప్పని తిప్పలు