తెలుగు సినీ పరిశ్రమ పరువు తీశారు : వర్మ

RGV Sensational Comments On Film Industry Letter To KCR

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇటీవల కాస్త లాజికల్‌గా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా డ్రగ్స్‌ విషయం మొదలైనప్పటి నుండి కూడా వర్మ తనదైన శైలిలో ప్రభుత్వంపై, సినిమా వారిపై సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. తాజాగా సినీ పరిశ్రమ మొత్తం ఏకం అయ్యి ప్రభుత్వంకు ఒక లేఖను రాయడం జరిగింది. ఆ లేఖలో కొందరు సినిమా పరిశ్రమకు చెందిన వారు డ్రగ్స్‌ తీసుకోవడం జరిగింది. వారి వల్ల మొత్తం సినిమా పరిశ్రమను తప్పుగా అనుకోవద్దు. దయచేసి సినిమా పరిశ్రమను మంచి మనస్సుతో క్షమించండి అంటూ సీఎం కేసీఆర్‌కు క్షమాపణ లేఖను రాయడం జరిగింది. అది పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశాడు. అంతా కూడా ఆ లేఖను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

ఇప్పుడు వర్మ ఆ లేఖపై తనదైన శైలిలో కాస్త ఘాటుగానే స్పందించాడు. సినిమా పరిశ్రమ ప్రముఖులకు సిగ్గు లేదా అంటూ ఒక పోస్ట్‌ చేశాడు. వర్మ ఆ పోస్ట్‌లో.. తెలుగు సినిమా పరిశ్రమ సిగ్గు పడాల్సింది డ్రగ్స్‌ కేసు గురించి కాదు, అంతా కూడా కలిసి బహిరంగ లేఖలో క్షమాపణలు చెప్పినందుకు. ప్రభుత్వంను ప్రాదేయపడి డ్రగ్స్‌ విషయంలో టాలీవుడ్‌ను లాగవద్దని కోరినందుకు. డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఏ ఒక్కరు కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా ఒప్పుకోలేదు, దానికి తోడు సిట్‌ అధికారులు కూడా తాము విచారించిన వారిలో ఫలాన వారు డ్రగ్స్‌ తీసుకున్నారు అని చెప్పలేదు. అయినా కూడా అంతా కలిసి మూకుమ్మడిగా డ్రగ్స్‌ కేసు విషయమై ప్రభుత్వంకు క్షమాపణలు చెప్పడం అనేది సినీ పరిశ్రమ పరువు తీయడమే, తప్పు ఒప్పుకున్నట్లుగానే పరిగనిస్తున్నట్లుగా వర్మ పేర్కొన్నాడు. వర్మ అభిప్రాయంతో పలువురు ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు కూడా ఏకీభవిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

మెగా ‘ఖైదీ’ రికార్డుపై ‘ఫిదా’ కన్ను

నా భర్త పరమ నీచుడు..!

నిఖిల్ పెళ్లి కొడుకు అవుతున్నాడోచ్.