జై రికార్డును స్పైడర్‌ బద్దలు కొట్టేనా?

Mahesh Babu Fans Want A Spyder Teaser To Cross The Jai Teaser

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్న ‘జై లవకుశ’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన జై టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో జై టీజర్‌ చెప్పకనే చెప్పింది. ఆ టీజర్‌కు కొద్ది గంటల్లోనే మిలియన్స్‌ వ్యూస్‌ దక్కాయి. ఏ సౌత్‌ సినిమాకు రాని వ్యూస్‌ జై టీజర్‌కు రావడంతో అంతా కూడా అవాక్కయ్యారు. ఎలా జై టీజర్‌కు అన్ని వ్యూస్‌ వచ్చాయి అని బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతటి రికార్డును సృష్టించిన జై టీజర్‌ను క్రాస్‌ చేసేలా స్పైడర్‌ టీజర్‌ ఉండాలని మహేష్‌బాబు ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్పైడర్‌’ చిత్ర టీజర్‌ను రేపు మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంచి సమయం చూసి వదిలి రికార్డు స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకోవాలనేది నిర్మాతల ప్లాన్‌గా తెలుస్తోంది. ఇప్పటికే స్పైడర్‌ టీజర్‌ విడుదల అయ్యింది. ఆ టీజర్‌కు మంచి స్పందనే వచ్చింది. అయితే ఆ టీజర్‌లో కేవలం స్పైడర్‌ను మాత్రమే చూపించి, మహేష్‌బాబును అలా చూపించడం జరిగింది. కాని ఇప్పుడు స్పైడర్‌ చిత్రంలోని కొన్ని సీన్స్‌ను కట్‌ చేసి టీజర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. మరి జై టీజర్‌ రికార్డును స్పైడర్‌ బద్దలు కొడతాడా అనేది చూడాలి. భారీ యాక్షన్‌ సీన్స్‌ ఉండే ఈ సినిమాను వచ్చే నెలలో దసరా సందర్బంగా విడుదల చేయబోతున్నారు. రేపు టీజర్‌లో సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలుగుతో పాటు తమిళం మరియు హిందీల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

పవన్‌ మూవీ.. 95 కోట్లు కాస్త 120 కోట్లు అయ్యింది

మెగా ‘ఖైదీ’ రికార్డుపై ‘ఫిదా’ కన్ను