శిల్పాని షేక్ చేస్తున్న మోహన్ రెడ్డి.

shilpa mohan reddy troubles with Mohan reddy names

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉప ఎన్నికల పర్వం అంతకంతకు రసవత్తరంగా మారుతోంది. 2019 ఎన్నికల సెమి ఫైనల్ గా నంద్యాల ఎన్నికను తీసుకున్న ప్రధాన రాజకీయ పక్షాలు ఎత్తుకి పై ఎత్తు వేస్తున్నాయి. మరీ ముఖ్యంగా టీడీపీ, వైసీపీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ అడుగులు వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ వేసిన ఓ ఎత్తుగడ వైసీపీ అభ్యర్థి శిల్పా ని టెన్షన్ లో పెట్టింది. ఆ ఎత్తుగడతో శిల్పా కి సాక్షాత్తు మోహన్ రెడ్డి శత్రువుగా మారాడు. అదెలాగో మీరే చూడండి.

నంద్యాల అసెంబ్లీ బరిలో పోటీ చేయడం శిల్పా మోహన్ రెడ్డికి కొత్తేమీ కాదు. అయితే అభ్యర్థి పాతవాడు అయినప్పటికీ గుర్తు ఎప్పుడూ మారుతూ వస్తోంది. 2009 లో హస్తం గుర్తు, 2014 లో సైకిల్ గుర్తు, ఇప్పుడు ఉపఎన్నికలో ఫ్యాన్ గుర్తు మీద శిల్పా పోటీ చేస్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ కి తోడు టీడీపీ వ్యూహాత్మకంగా ఇంకో కన్ఫ్యూజన్ పెట్టింది. పేరులో చివర మోహన్ రెడ్డి వచ్చే ముగ్గురు నలుగురిని ఇండిపెండెంట్ లుగా ఎన్నికల బరిలోకి దించింది. దీంతో శిల్పా మోహన్ రెడ్డి పేరు, గుర్తు కనుక్కోవడం కాస్త ఇబ్బందికరమే. అసలే గుర్తులు మార్చే అలవాటున్న శిల్పాకి ఇప్పుడు ఈ విధంగా మోహన్ రెడ్డి పేరు కూడా ఓ సమస్యగా మారింది.
మరిన్ని వార్తలు:

ఆ మంత్రి ఇంటిలో పూజ చూస్తే మీ మైండ్ బ్లాక్.

నంద్యాల‌పై ల‌గ‌డ‌పాటి స‌ర్వేలో ఏముంది?

మామాఅల్లుళ్ళ ప్లాన్ రివర్స్ ?