పల్నాడులో టిడిపి, వైసిపి వర్గాల ఘర్షణ : ఉద్రిక్తత

tdp and ysrcp followers fight at palnadu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏపీలో ఈ మధ్య కాలలంలో అధికార, ప్రతిపక్షపార్టీల కార్యకర్తలు, మండల స్థాయి నేతల మధ్య వివాదాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ఇరువర్గాలు రోడ్డున పడి కొట్టుకోవడం కేసులు, జైళ్ళకి దాకా వెళ్లడం మామూలైపోయింది. తాజాగా.. గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య నిన్న జరిగిన ఘర్షణలో ఆరుగురికి గాయాలయ్యాయి. అందుతున్న వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పిడుగురాళ్లలో వైసిపి బహిరంగ సభకు ఆ పార్టీ శ్రేణులు బైకు లతో ర్యాలీగా బయలుదేరారు.

అయితే అలా వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండా ప్రస్తుత సర్పంచ్‌ టీడీపీకి చెందిన చింతపల్లి మోహిద్దున్‌బీ, జానీబాష ఇంటి ముందుగా ర్యాలీ వెళుతుండగా ఓ యువకుడు బైకుతో జీరో కట్ వేయడంతో తిప్పటంతో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో రెండు విడిపోయిన ఇరు పార్టీల వారు కర్రలతో, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాల దాడిలో దాదాపు ఆరుగురుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలసుకున్న పిడుగురాళ్ల పోలీసు సిబ్బంది సంఘతనా స్థలానికి చేరుకొని పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకున్నారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.