‘నేనే రాజు నేనే మంత్రి’ కొత్త తరహా ప్రమోషన్స్‌

Rana Using New Technology For Promotions,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రానా హీరోగా కాజల్‌ హీరోయిన్‌గా తేజ దర్శకత్వంలో సురేష్‌బాబు నిర్మించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సినిమా ప్రచార కార్యక్రమాలు అన్ని కూడా తన బుజాలపై వేసుకుని మోస్తున్నాడు. కనీ విని ఎరుగని స్థాయిలో సినిమాకు ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఇటీవలే బిగ్‌బాస్‌ షోలో సందడి చేసిన రానా ఇంకా పలు షోల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటూ ఉన్నాడు.

‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో రానా జోగేంద్ర అనే రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు. అందుకే సినిమా ప్రమోషన్‌లో రానా ఒక రాజకీయ నాయకుడిగానే కనిపిస్తున్నాడు. ఎప్పుడు చూసినా కూడా పాయింట్‌, షర్ట్‌, జీన్స్‌ ఇలా మోడ్రన్‌ డ్రస్‌లలో కనిపించే రానా గత కొన్ని రోజులుగా పూర్తిగా తెల్ల చొక్క, తెల్ల లుంగీతో జోగేంద్రగానే కనిపిస్తున్నాడు. సినిమా షూటింగ్‌ పూర్తి అయినా కూడా జోగేంద్ర తరహాలోనే రానా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది కొత్త తరహా ప్రమోషన్‌ అనుకోవచ్చు. ఈ వారంలో మూడు సినిమాలు విడుదలకు ఉన్నా కూడా ఈ చిత్రంపైనే ప్రేక్షకులు ఎక్కువగా దృష్టి పెట్టారు. సినీ వర్గాల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి ఉంది. మరి కొన్ని రోజుల్లోనే సినిమా విడుదల అయ్యి సక్సెస్‌ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు:

‘మహానటి’లో మంచు వారి పాప

మెగా ‘ఖైదీ’ రికార్డుపై ‘ఫిదా’ కన్ను

నా భర్త పరమ నీచుడు..!