బాబోయ్‌.. జోగేంద్ర వంటి భర్త నాకు వద్దు

kajal-aggarwal-says-jogendra-does-not-want-to-have-a-wife

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స్టార్‌ హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా టాలీవుడ్‌ నోటెడ్‌ స్టార్స్‌ అందరితో కూడా నటించిన ముద్దుగుమ్మ కాజల్‌ తాజాగా రానా హీరోగా తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు దుమ్ము దుమ్ముగా సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రానా మరియు కాజల్‌ దాదాపు అన్ని మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై తమ అభిప్రాయాలను, అంచనాలను చెప్పకనే చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా మీడియా సమావేశంలో భాగంగా కాజల్‌ మాట్లాడటం జరిగింది. 

మీడియాతో కాజల్‌ తన పెళ్లి విషయమై మాట్లాడుతూ.. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలోని జోగేంద్ర మంచి వాడే, కాని నేను అలాంటి వ్యక్తికి భార్యను కావాలని కోరుకోవడం లేదు. సినిమాలోని రాధ పాత్ర తీరు, నా తీరు పూర్తి విభిన్నంగా ఉంటుంది. అందుకే నేనే జోగేంద్రను పెళ్లి చేసుకోవాలని భావించడం లేదు అంటూ కాజల్‌ చెప్పుకొచ్చింది. కాజల్‌ ఉద్దేశ్యం ఏంటి అంటే ఆమె రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోకుండా ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటుందట. ఆ విషయాన్ని కాస్త క్లారిటీ లేకుండా చెప్పింది. ఈ చిత్రంలో రాధ పాత్రలో కాజల్‌ మంచి నటన కనబర్చిందని అంటున్నారు. ఇక రానా మరియు కాజల్‌ల మద్య కెమిస్ట్రీకి విపరీతమైన మార్కులు పడుతున్నాయి. తప్పకుండా వీరిద్దరి జోడీ సినిమాకు ప్లస్‌ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

సాయి పల్లవి రాములమ్మ ఏంట్రా?

ఈసారి మల్టీస్టారర్‌ దాగుడు మూతలు

శింబు ఓవియాతో పెళ్లా…?