నేనే రాజు నేనే మంత్రి…తెలుగు బులెట్ ప్రివ్యూ.

Nene Raju Nene Mantri Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రానా దగ్గుబాటి హీరోగా, తేజ దర్శకత్వంలో వస్తున్న నేనే రాజు నేనే మంత్రి రేపు భారీ ఎత్తున విడుదల కాబోతోంది. రానా వెండితెరకి పరిచయం అయిన దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన హీరోగా నిర్మాత సురేష్ బాబు చేస్తున్న చిత్రం ఇది. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేష్ బాబు సమర్పణ చేస్తుండగా భరత్ చౌదరి ,కిరణ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక హీరోయిన్ గా కాజోల్ కి ఇది 50 వ సినిమా. కాథెరిన్, అశుతోష్ రానా, నవ దీప్ ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న మూడు సినిమాల మధ్యలోను ఎక్కడలేని ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తోంది. నేనే రాజు నేనే మంత్రి ఎవరూ ఊహించని విధంగా ఇంత ఆసక్తి రేపడం వెనుక కారణాలు ఏమిటో చూద్దాం.

వందకుపైగా సినిమాలు తీసిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కొన్నాళ్లుగా సరైన కధల కోసం వెదుకులాడుతూనే వుంది. సురేష్ బాబు ఓ కథని ఓకే చెయ్యాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. పైగా ఈసారి హీరోగా చేయబోయేది తన కొడుకు అని తెలిస్తే ఆ ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా?. కానీ కథ వినిపించడానికి వచ్చిన దర్శకుడు తేజ కి కొన్నాళ్లుగా కాదు కాదు కొన్నేళ్లుగా హిట్స్ లేవు. అయినా తేజ చెప్పిన కథని సురేష్ బాబు ఓకే చేశారు. పైగా నిర్మాతగా ఆ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ఇక కధానాయకుడు రానా వెండితెరకి పరిచయం అయినప్పటినుంచి చూస్తున్నాం. సినిమాలో ఏదో ఒక కొత్తదనం లేనిది ఒప్పుకునే రకం కాదు రానా. ఆ తండ్రీకొడుకులని అంతగా కదిలించిన కథ చెప్పిన తేజ ఈసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఫ్యామిలీ డ్రామాని తెరకి ఎక్కించడంతో ఈ సినిమా మీద అందరి కళ్ళు పడ్డాయి.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినప్పటినుంచి ఇండస్ట్రీ ఆసక్తిగా చూడటం ఆరంభం అయ్యింది. ఇప్పుడు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ముగించుకుని యూ / ఏ సర్టిఫికెట్ తో 153 నిడివిగల సినిమాగా విడుదలకి సిద్ధం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ ఇంకా పెరిగింది. ఈ సినిమాతో రానా ఓ స్టార్ గా ఎదిగిపోతాడని తేజ చెప్పడం, తేజ డైరెక్టోరియల్ స్కిల్స్ గురించి రానా పొగడటం కూడా ఈ సినిమా మీద అంచనాలు పెంచింది. క్లయిమాక్స్ సైతం ఊహకు అందని విధంగా ఉందని అంటున్నారు. క్లయిమాక్స్ ఒక్కటే కాదు సినిమా నిడివి, ఎంచుకున్న జానర్ అన్నీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కి భిన్నంగా వెళుతున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి. అయినా చిత్ర యూనిట్ ధైర్యంగా ముందుకు రావడానికి ఒకే ఒక్క కారణం కనిపిస్తోంది. అదే…ఏ ట్రెండ్ నడుస్తున్నా తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఆదరిస్తారన్న నమ్మకం. ఆ నమ్మకం ఇప్పుడు రానా కళ్ళలో, తేజ మోహంలో, సురేష్ బాబు మాటల్లో నిండుగా కనిపిస్తోంది. వారిని చూసి నేనే రాజు నేనే మంత్రి మీద తెలుగు ప్రేక్షకుల విశ్వాసం పెరిగింది. ఆ నమ్మకానికి తగినట్టే నేనే రాజు నేనే మంత్రి సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్.

మరిన్ని వార్తలు:

సాయి పల్లవి రాములమ్మ ఏంట్రా?

ఈసారి మల్టీస్టారర్‌ దాగుడు మూతలు

శింబు ఓవియాతో పెళ్లా…?