లై …తెలుగు బులెట్ ప్రివ్యూ.

lie Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
“లై” పేరుతో నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న చిత్రం రేపు విడుదలకి సర్వసన్నద్ధంగా వుంది. అ ఆ సినిమా విజయం తర్వాత నితిన్ ఆచితూచి ఎంపిక చేసుకున్న సినిమా” లై”. కృష్ణగాడి వీర ప్రేమ గాధ హిట్ తర్వాత హను రాఘవపూడి అదే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ లై కథతో ఒప్పించారు.

సాఫ్ట్ హీరో నితిన్ రఫ్ లుక్ లో కనిపిస్తున్న వైవిధ్యం ” లై” కధ లోను ఉందని చిత్ర యూనిట్ చెబుతున్న మాట. నితిన్ మార్కెట్ ని మించి ఖర్చు పెట్టడానికి నిర్మాతలని ఈ కధే ఉసిగొలిపిందట. ఓ ప్రేమ కధ ‘లై ‘కి ఇంత హైప్ రావడానికి టైటిల్ కి ఇచ్చిన కాప్షన్ ముఖ్య కారణం. “లై” లో ఎల్ అంటే లవ్ అని, ఐ అంటే ఇంటలిజెన్స్ అని, ఈ అంటే ఎనిమిటి అని ఇచ్చిన కాప్షన్ ఎక్కడలేని ఆసక్తి రేకెత్తించింది. ప్రేమ, తెలివి, శత్రుత్వం ని కలిపి హను రాఘవపూడి చేసిన తమాషా నిజంగా లై మీద ఇంటరెస్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక తమిళ నటుడు అర్జున్ చేస్తున్న పాత్ర ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. ఈ సినిమా మీద నిర్మాత దర్శకులతో పాటు హీరో నితిన్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

మరిన్ని వార్తలు:

సాయి పల్లవి రాములమ్మ ఏంట్రా?

ఈసారి మల్టీస్టారర్‌ దాగుడు మూతలు

శింబు ఓవియాతో పెళ్లా…?