గుణశేఖర్‌ క్లారిటీ.. అదే కాని అది కాదు!

Gunasekhar Clarifies About directing Bhakta Prahlada Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, మంచి కలెక్షన్స్‌ను రాబట్టిన విషయం తెల్సిందే. ఒక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రానికి సాహసం చేసి భారీ బడ్జెట్‌ను పెట్టిన గుణశేఖర్‌ నమ్మకం ఒమ్ము కాలేదు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు మంచి లాభాలను తెచ్చి పెట్టడంతో గుణశేఖర్‌ మరోసారి అదే తరహాలో పౌరాణిక చిత్రాన్ని చేయాలని ఉవ్విల్లూరుతున్నాడు. అందుకోసం పలు కథలు అనుకుని చివరకు భక్త ప్రహ్లాద చిత్రానికి కమిట్‌ అయ్యాడని కొన్ని వారాలుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది.

‘భక్త ప్రహ్లాద’ చిత్రంపై దర్శకుడు గుణశేఖర్‌ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో మరో ఆలోచన గుణశేఖర్‌ చేస్తున్నాడేమో అని అనుకున్నారు. గుణశేఖర్‌ తర్వాత సినిమా భక్త ప్రహ్లాద కాదని సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఆ విషయమై దర్శకుడు గుణశేఖర్‌ స్పందించాడు. తన తర్వాత సినిమాను భక్త ప్రహ్లాద కథాంశంతోనే తెరకెక్కించబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. అయితే టైటిల్‌ మాత్రం అంతా భావిస్తున్నట్లుగా ‘భక్త ప్రహ్లాద’ కాదు అని, మరో టైటిల్‌ను అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలు పెడతాను అంటూ గుణ ప్రకటించాడు. ఈ చిత్రంలో ఎవరు ముఖ్య పాత్ర పోషించేది మాత్రం ఆయన క్లారిటీగా చెప్పలేదు. త్వరలోనే ఆ విషయంపై ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు:

‘స్పైడర్‌’ టీజర్‌పై నెగటివ్‌ కామెంట్స్‌

‘నేనే రాజు నేనే మంత్రి’ హంగామా షురూ

భక్త ప్రహ్లాద ని తెస్తున్న గుణశేఖర్.