‘స్పైడర్‌’ టీజర్‌పై నెగటివ్‌ కామెంట్స్‌

negative-comments-on-mahesh-babu-spyder-teaser

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘స్పైడర్‌’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. దసరా కానుకగా వచ్చే నెల చివరి వారంలో సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఇక నేడు మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్బంగా చిత్ర టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. సినిమా టీజర్‌పై ఫ్యాన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రేక్షకులు కూడా బాగుంది అంటున్నారు. అయితే కొందరు విశ్లేషకులు మరియు విమర్శకులు మాత్రం ‘స్పైడర్‌’ టీజర్‌ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిందని, 125 కోట్ల బడ్జెట్‌ చిత్రం అన్నప్పుడు ఇంతకు మించి ఆశిస్తామని, ఆ స్థాయిలో లేకపోవడం కాస్త నిరాశను పర్చిందని అంటున్నారు.

టీజర్‌లోని షాట్స్‌ అన్ని కూడా సాదా సీదా యాక్షన్‌ చిత్రాల తరహాలోనే ఉన్నాయి. హీరోయిజంను ఎలివేట్‌ చేస్తూ అన్ని టీజర్‌లు ఉన్నట్లుగానే ఉంది. ఇందులో ఇంకా కొత్తగా ఏదైనా చూపించి ఉంటే బాగుండేది. కొత్తగా కాకున్నా విభిన్నంగా అయినా టీజర్‌ను ప్లాన్‌ చేస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. టీజర్‌లోనే అంతా చూపించాలి అంటే ఎలా అని కొందరు అభిప్రాయ పడుతుంటే మరి కొందరు మాత్రం ట్రైలర్‌లో మొత్తం కవర్‌ చేస్తారని ఆశిస్తున్నారు. మొత్తానికి ‘స్పైడర్‌’ టీజర్‌ ఎక్కువ ఇష్టం, కొంచెం కష్టం అన్నట్లుగా ఉంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ‘పెళ్లి చూపులు’ ఫేం ప్రియదర్శన్‌ ముఖ్య పాత్రలో నటించడం విశేషం.

మరిన్ని వార్తలు:

‘నేనే రాజు నేనే మంత్రి’ హంగామా షురూ

రెజీనా ఇక సర్దేసుకోవాల్సిందే

స్పైడర్ టీజర్ సూపర్బ్…మహేష్ అదుర్స్.