రెజీనా ఇక సర్దేసుకోవాల్సిందే

Regina out of luck in Tollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా హీరోలు సాయి ధరమ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌తో వరుసగా చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న రెజీనా తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలగడం ఖాయం అని అంతా భావించారు. రెజీనా మరియు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇద్దరు కూడా ఒకే సమయంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. ఇద్దరు తప్పకుండా తెలుగులో స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటారని కొందరు అభిప్రాయ పడ్డారు. అయితే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది, కాని రెజీనా మాత్రం ఇంకా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా చేసిన ‘నక్షత్రం’ సినిమా తర్వాత అయిన తెలుగులో మళ్లీ వరుసగా ఆఫర్లు వస్తాయని ఆశించిన ఈ అమ్మడికి నిరాశే మిగిలింది.

‘నక్షత్రం’ సినిమాలో హద్దులు దాటి అందా ప్రదర్శణ చేసిన ఈ అమ్మడికి ఏమాత్రం లాభం చేకూరలేదు. సినిమా డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకోవడంతో రెజీనాకు ఇక తెలుగులో అవకాశాలు రావడం దాదాపు అసాధ్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలుగులో తనకు అంత సీన్‌ లేదు అని గుర్తించిన ముద్దుగుమ్మ తమిళంలో అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తుంది. ఇక ‘నక్షత్రం’ సినిమా తర్వాత పూర్తిగా తమిళంలో ఈమె పరిమితం అవుతుందేమో చూడాలి. తెలుగులో మళ్లీ ఈమెకు అవకాశం వచ్చింది అంటే అదో గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇక తెలుగులో ఈమె మళ్లీ మునుపటి క్రేజ్‌ తెచ్చుకోవడం దాదాపు అసాధ్యం.

మరిన్ని వార్తలు:

స్పైడర్ టీజర్ సూపర్బ్…మహేష్ అదుర్స్.

కృష్ణార్జున యుద్ధంలో నాని

ఈసారి మల్టీస్టారర్‌ దాగుడు మూతలు