కృష్ణార్జున యుద్ధంలో నాని

nani krishnarjuna yudham shooting begins

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ లో హీరో నానికి ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం. ఎలాంటి పాత్ర‌క‌యినా జీవం పోస్తారని పేరుతెచ్చుకున్నారు. అటు క‌మ‌ర్షియ‌ల్ గానూ దూసుకుపోతున్నారు. వ‌రుస హిట్లు ఖాతాలో వేసుకుంటున్నారు. మినిమ‌మ్ గ్యారంటీ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నారు. దానికి త‌గ్గట్టుగానే నానికి అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. తెలుగులో ఇప్పుడు బాగా బిజీగా ఉన్న యువ‌త‌రం నాయ‌కుల‌లో నాని ఒక‌రు.

వ‌రుస‌పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్న నాని ప్ర‌స్తుతం ఒకేసారి రెండు సినిమా షూటింగ్ ల‌లో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై శ్రీరాం వేణు  ద‌ర్శ‌క‌త్వంలో త‌న 20వ చిత్రం ఎంసీఏలో న‌టిస్తున్నారు. ఇప్పుడు  రెండో చిత్రం షూటింగ్ కూడా మొద‌లుపెట్టారు. సినిమా పేరు కృష్ణార్జున యుద్ధం. ఇందులో కృష్ణుడుగానూ, అర్జునుడిగాను నాని ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కుడు. నాని స‌ర‌స‌న శ‌త‌మానం భ‌వ‌తి ఫేం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం.

అనుప‌మ గ‌తంలోలా సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో కాకుండా ఈ సినిమాలో మోడ్ర‌న్ యువ‌తిగా క‌నిపించ‌నుంది. షూటింగ్ లో పాల్గొన్న నాని…కృష్ణార్జున యుద్ధం మొద‌ల‌యింది అంటూ  ఓ ఫోటోను పోస్ట్ చేశారు. బైక్ పై పిల్ల‌న గ్రోవి ఉన్న ఈ ఫోటో అంద‌రినీ ఎట్రాక్ట్ చేస్తోంది. మోడ్ర‌న్ కృష్ణుడుగా, అర్జునుడిగా ఈ న్యాచుర‌ల్ స్టార్ న‌ట‌న ఎలా ఉంటుందో, ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు మెప్పిస్తారో చూడాలి.

మరిన్ని వార్తలు:

సాయి పల్లవి రాములమ్మ ఏంట్రా?

ఈసారి మల్టీస్టారర్‌ దాగుడు మూతలు

శింబు ఓవియాతో పెళ్లా…?