హమ్మయ్య.. గండం గట్టెక్కారు

Congress Party Leader Ahmed Patel Wins in Gujarath Rajya Shabha Elections

 

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సోనియా రాజకీయ కార్యదర్శి పదేళ్ల పాటు యూపీయే హయాంలో చక్రం తిప్పిన అహ్మద్ పటేల్ ఎంతో మంది నేతల తలరాతలు రాశారు. సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో పట్టుబట్టి మరీ అమిత్ షా ను జైల్లో పెట్టించారు. నిజానికి మోడీని టార్గెట్ చేసినా.. ఆయన మాత్రం తప్పించుకున్నారు. ఇప్పుడు అదే అహ్మద్ పటేల్ తో బీజేపీ నేతలు ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో గెలిచినా.. అహ్మద్ పటేల్ గర్వంగా తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. ఇంత జరిగాక కూడా ఆయన గుజరాత్ అసెంబ్లీలో ఇవే ఫలితాలు రిపీటౌతాయనడం చూస్తుంటే కామెడీ పీస్ ను చూసినట్లే ఉంది. 44 మంది ఎమ్మెల్యేల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి, రిసార్ట్ పాలిటిక్స్ చేసి రాజ్యసభలో అడుగుపెట్టిన అహ్మద్ పటేల్.. కాంగ్రెస్ కు ఉద్ధరించిందేముందని ఆ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

ఒక్క అహ్మద్ పటేల్ కోసం ఇంత హైరానా పడాల్సిన పనిలేదని, అహ్మద్ పటేల్ ఇచ్చిన సలహాలేవీ పార్టీ బలోపేతానికి ఉపయోగపడలేదని వారంటున్నారు. మొత్తం మీద సోనియా కూడా అనారోగ్యంతో ఉండి కూడా నిమిష నిమిషానికి అహ్మద్ పటేల్ గురించి మానిటర్ చేసి తీవ్ర అలసటకు గురయ్యారు. మరి రాజ్యసభలో అహ్మద్ పటేల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో.

మరిన్ని వార్తలు:

పవన్ మీద వైసీపీ, కాంగ్రెస్ లేఖా రాజకీయం.

శిల్పాని షేక్ చేస్తున్న మోహన్ రెడ్డి.

మిత్ర‌ప‌క్ష‌మా….? వైరిప‌క్ష‌మా..??