‘నేనే రాజు నేనే మంత్రి’ హంగామా షురూ

nene-raju-nene-mantri-movie-creating-buzz-on-fans

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఈ వారం ప్రేక్షకుల ముందుకు మూడు చిత్రాలు రాబోతున్నాడు. ఆ మూడు సినిమాల్లో కూడా ఎక్కువగా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంపై ప్రేక్షకుల దృష్టి ఉంది. ‘బాహుబలి’ చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించిన రానా తన క్రేజ్‌ను అమాంతం పెంచేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత రానా చేస్తున్న ఏ సినిమా అయినా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటుంది. ఇక ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో రానా పొలిటికల్‌ లీడర్‌గా కనిపించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిక కనబడుతుంది. రాజకీయ నేపథ్యంలో సినిమాలను తెలుగు ప్రేక్షకులు పలు సార్లు ఆధరించిన దాఖలాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాను కూడా తప్పకుండా ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకంగా ఉందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. 

మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సందడి ప్రారంభం అయ్యింది. హైదరాబాద్‌లో పలు థియేటర్లలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఎక్కడెక్కడ విడుదల కాబోతుందో అక్కడ అప్పుడే కటౌట్‌లు పెట్టేశారు. అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఓవర్సీస్‌లో కూడా సినిమా టికెట్స్‌ బుకింగ్‌ ప్రారంభం అయ్యింది. మల్టీప్లెక్స్‌ థియేటర్లలో భారీ ఎత్తున టికెట్లు అడ్వాన్స్‌ బుకింగ్‌ అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి సినిమా మరో రెండు రోజులు ఉండగానే భారీగా సందడి కనిపిస్తుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్‌బాబు నిర్మించిన విషయం తెల్సిందే. కాజల్‌ హీరోయిన్‌గా నటించింది. రానా, కాజల్‌ల రొమాన్స్‌ ఈ సినిమాకు హైలైట్‌ అవుతుందని టీజర్‌ మరియు ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

మరిన్ని వార్తలు: