అఖిల్‌కు గాలం వేస్తున్న బోయపాటి?

boyapati srinu next movie with akhil Akkineni

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరు అయిన బోయపాటి శ్రీను తాజాగా ‘జయ జానకి నాయక’ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ఆ సినిమా తెరకెక్కింది. భారీ స్థాయిలో అంచనాలున్న ఆ చిత్రం ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతు బోయపాటి తన తర్వాత సినిమాలపై చిన్న హింట్స్‌ ఇచ్చాడు. చిరంజీవి 152వ చిత్రాన్ని తానే చేస్తాను అంటూ చెప్పుకొచ్చిన బోయపాటి అంతకు ముందే మరో సినిమా ఉంటుందని సూచాయిగా హింట్‌ అవ్వడం జరిగింది. బోయపాటి తర్వాత సినిమా అఖిల్‌తో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా బోయపాటి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను చిరంజీవి, బాలకృష్ణ, అఖిల్‌లకు కథలు సిద్దం చేసి పెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా ‘జయ జానకి నాయక’ చిత్రంపైనే ఉందని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం పూర్తి చేసిన తర్వాత మరో సినిమా గురించి ఆలోచిస్తాను అంటూనే అఖిల్‌ ఒక అద్బుతమైన నటుడు అని, ఆయనతో ఒక మంచి యాక్షన్‌ చిత్రాన్ని చేయవచ్చని తనకు అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. చిరంజీవి 152వ చిత్రానికి కనీసం సంవత్సరం అయిన సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే అఖిల్‌తో బోయపాటి తర్వాత సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం బోయపాటి దర్శకత్వంలో రాబోతున్న కొత్త యాక్షన్‌ ఎవరిదో..!

మరిన్ని వార్తలు:

నేనే రాజు నేనే మంత్రి…తెలుగు బులెట్ ప్రివ్యూ.

లై …తెలుగు బులెట్ ప్రివ్యూ.

జయ జానకి నాయక ప్రివ్యూ.