‘లై’ దర్శకుడికి కొత్త జాబ్‌!

,Hanu Raghavapudi becomes father ,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఒక చిన్న చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు హను రాఘవపూడి. మొదటి సినిమాతోనే రాజమౌళి దృష్టిలో పడటంతో తెలుగు ప్రేక్షకులు హను రాఘవపూడిని గుర్తించారు. మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్న నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో పలువురు యువ హీరోలు నటించేందుకు పోటీ పడ్డారు. కాని చాలా గ్యాప్‌ తీసుకుని ఆయన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఆ సినిమా కూడా మంచి మార్కులు తెచ్చి పెట్టింది. తాజాగా ‘లై’ చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదటి రెండు సినిమాలకు పూర్తి విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని, దర్శకుడిగా మరో సక్సెస్‌ను హను దక్కించుకోబోతున్నాడని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ‘లై’ చిత్రం ఫలితం తేలక ముందే హనుకు కొత్త జాబ్‌ వచ్చింది. అదే తండ్రి జాబ్‌.

గత సంవత్సరం అమూల్యను వివాహం చేసుకుని ఒక ఇంటివాడు అయిన హను తాజాగా తండ్రి అయ్యి మరింత బాద్యతను పెంచుకున్నాడు. ప్రమోషన్‌ వచ్చిందని హను సంతోషంగా సన్నిహితులతో షేర్‌ చేసుకున్నాడు. ‘లై’ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు హనుకు గుడ్‌ న్యూస్‌ తెలిసింది. ‘లై’ సినిమా సక్సెస్‌ అయ్యి హను సంతోషం మరింత పెరుగుతుందా అనేది చూడాలి. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో అమూల్య బాబుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని హను కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు:

కాజల్‌పై కోర్టు ఆగ్రహం

‘లై’ సక్సెస్‌ అయితేనే..!

ఆ ప్రాజెక్ట్‌ వద్దనుకున్న బాలయ్య