హైదరాబాద్, బెంగుళూరు,చెన్నై కన్నా అమరావతి మిన్న ?

Chandrababu launch BRS medicity in amaravati

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో ఇప్పుడిప్పుడే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల శంఖుస్థాపనలు మొదలు అవుతున్నాయి. తాజాగా బీఆరెస్ మెడిసిటీ కి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కన్నా అమరావతి గొప్పగా ఎదుగుతుందని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ మెడిసిటీకి సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. తుళ్లూరు మండలం, దొండపాడులో ఏర్పాటు చేయనున్న ఈ మెడిసిటీలో వైద్యవర్శిటీ, 750 పడక సూపర్‌ స్పెషాలి టీ ఆస్పత్రి, 3 స్టార్‌ హోటల్‌, సర్వీస్‌ అపార్టుమెంట్లను బీఆర్‌ఎస్‌ నిర్మించనుంది. అలాగే యోగా కేంద్రం, స్టెమ్‌ సెల్‌ పరిశోధన కేంద్రాలను కూడా బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేయనుంది.బీఆర్‌ఎస్‌ మెడిసిటీలో రూ.3 వేల కోట్లతో వైద్య వర్శిటీ నిర్మిస్తున్నట్లు ఈడీబీ సీఈఓ కృష్ణ కిశోర్‌ తెలిపారు. మెడిసిటీకి సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.1000కోట్లతో 1000 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రూ.600 కోట్లతో వైద్య ఉపకరణాల యూనిట్‌, రూ.250 కోట్లతో క్వాటం డేటా సెంటర్‌, రూ.400 కోట్లతో అమరావతి ఐబీ స్కూల్‌, రూ.250 కోట్లతో నాలెడ్జ్‌ ప్రాసెసింగ్‌ ఔట్‌ సోర్సింగ్‌ కేం ద్రాలను ఈ మెడిసిటీలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

బీఆర్‌శెట్టి గ్రూపు మెడిసిటీ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోందని, బీఆర్‌శెట్టి గ్రూపు పెట్టుబడులతో రాజధానిలో వేలాదిమందికి ఉపాధి అందుతుందని సీఎం పేర్కొన్నారు. మెడిసిటీలో ఆస్పత్రులు, హోటళ్లు, పరిశోధన కేంద్రం, యోగా కేంద్రం, అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటవుతాయన్నారు. త్వరలో అమరావతి నుంచి ఎమిరేట్స్‌కు తొలి విదేశీ విమానం నడుస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై కంటే అమరావతి అద్భుత నగరంగా మారుతుందని సీఎం తెలిపారు. బీఆర్‌ఎస్‌ మెడిసిటీ శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తాత్కాలిక సచివాలయాన్ని కూడా అత్యుత్తమమైన విధానంలోనే నిర్మించామని, ఇక శాశ్వత పరిపాలన నగరం కూడా అంతర్జాతీయ స్థాయిలోనే నిర్మిస్తామని పేర్కొన్నారు. అమరావతిని నాలెడ్జ్‌ మరియు మెడికల్‌ హబ్‌గా రూపొందిస్తామన్నారు.మంగళగిరి వద్ద త్వరలోనే ఎయిమ్స్‌ వస్తుందని, ఇండో యూకే ఆస్పత్రికి కూడా వీలైనంత త్వరగా శంకుస్థాపన చేస్తామని సీఎం పేర్కొన్నారు. ఆస్పత్రుల ప్రారంభానికి ముందే 13 వైద్య కళాశాలలొస్తున్నాయని సీఎం తెలిపారు. అలాగే అమరావతిలో ఎక్కణ్నుంచి ఎక్కడికైనా 15 నిమిషాల్లోనే చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

మరిన్ని వార్తలు:

మోత్కుపల్లికి ఈసారైనా పదవి దక్కుతుందా..?

రెవిన్యూలోటూ పూడ్చేది లేదు

జనసేన మొదటి పొలిటకల్ ఎంట్రీ