Political Updates: స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వనున్న BRS

Political Updates: BRS to support unanimous election of Speaker
Political Updates: BRS to support unanimous election of Speaker

స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వనుంది బీఆర్ఎస్ పార్టీ. నేడు స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు . అయితే.. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వనున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు… నామిషన్ కార్యక్రమనికి హాజరు కానున్నారు.

ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే అంశంపై బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈనెల 15న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈనెల 16న శాసనసభలో, మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పెట్టి చర్చిస్తారు. 17వ తేదీన సైతం సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి.