కాజల్‌పై కోర్టు ఆగ్రహం

High Court Serious On Kajal For Hair Oil Advertisement

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్‌ గత దశాబ్ద కాలంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. సినిమాల్లోనే కాకుండా ఈ అమ్మడు అప్పుడప్పుడు బుల్లి తెరపై కూడా కనిపిస్తూ వస్తుంది. పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ వస్తున్న కాజల్‌ అగర్వాల్‌ తాజాగా ఒక కంపెనీపై కోర్టుకు వెళ్లింది. కేరళకు చెందిన ఒక హెయిర్‌ ఆయిల్‌ సంస్థకు కాజల్‌ అగర్వాల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించింది. వారితో సంవత్సరం పాటు అగ్రిమెంట్‌ కుదుర్చుకున్న కాజల్‌ అందుకు భారీ పారితోషికాన్ని తీసుకుంది. ఆ హెయిర్‌ ఆయిల్‌ కంపెనీ వారు సంవత్సరం తర్వాత కూడా కాజల్‌ యాడ్స్‌ను ప్రసారం చేయడంతో పాటు, ఆమె ఫొటోను వాడుకున్నారు.

తన అనుమతి లేకుండా, ఒప్పందం పూర్తి అయిన తర్వాత తన ఫొటోను, తన బ్రాండ్‌ను వాడుకున్నందుకు గాను తనకు 2.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోర్టుకు కాజల్‌ వెళ్లింది. దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తుంది. ఎట్టకేలకు ఈ కేసులో తుది తీర్పు వచ్చింది. కాని ఆ తీర్పు కాజల్‌కు వ్యతిరేకంగా వచ్చింది. సంవత్సర కాలం పాటు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు భారీ పారితోషికం తీసుకున్న తర్వాత కాస్త సంయమనం పాటించాలి. సదరు సంస్థ సంవత్సరం కాగానే కాజల్‌కు సంబంధించిన అన్ని వీడియోలు మరియు ఫొటోలను తీసేయడం కాస్త కష్టం. అందుకు సమయం కావాలని మిమ్ములను అడిగినా కూడా మీరు ఇవ్వలేదు. అయినా కూడా నెల నుండి రెండు నెలల్లో మీకు సంబంధించి ఏ విషయం లేకుండా వారు జాగ్రత్త పడ్డారు. అలాంటప్పుడు ఎందుకు ఆ కంపెనీ మీకు 2.5 కోట్లు ఇవ్వాలంటూ కాజల్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు కొట్టి వేయడం జరిగిందంటూ న్యాయమూర్తి ప్రకటించారు.

మరిన్ని వార్తలు:

‘లై’ సక్సెస్‌ అయితేనే..!

ఆ ప్రాజెక్ట్‌ వద్దనుకున్న బాలయ్య