రానాను సూపర్‌ స్టార్‌ చేసిన సమంత

samantha-reacts-on-rana-nene-raju-nene-mantri-cutout

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రానా హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రానాకు సమంత శుభాకాంక్షలు తెలిపింది. ట్విట్టర్‌లో కాస్త విభిన్నంగా రానాకు సమంత ఆల్‌ది బెస్ట్‌ చెప్పింది. సమంత చేసిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సమంత ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రానికి సంబంధించిన కటౌట్‌ను ట్వీట్‌ చేసి సూపర్‌ స్టార్‌ బ్రదర్‌ రానాకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ ట్వీట్‌ చేయడం జరిగింది. అందుకు రానా కూడా స్పందించి కృతజ్ఞతలు చెప్పాడు. 

త్వరలో సమంత నాగచైతన్యను వివాహం చేసుకోబోతుంది. అందుకే సమంతకు రానాకు చుట్టరికం ఏర్పడబోతుంది. ఆ కారణంగానే రానాను బ్రదర్‌ అంటూ సంబోధించింది. రానా, నాగచైతన్యలు బావ బావమర్ది వరుస అవుతారు. అందుకే రానాను సమంత బ్రదర్‌ అనేసింది. గత కొన్ని రోజులుగా ఇలా కొత్త పిలుపుతో రానాను సమంత పిలుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సూపర్‌ స్టార్‌ బ్రదర్‌ అంటూ రానాను సంబోధించడం అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తోంది. సమంత దృష్టిలో రానా సూపర్‌ స్టార్‌ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో రానా సూపర్‌ స్టార్‌ అవుతాడని ముందే సమంత ఇలా ట్వీట్‌ చేసిందో లేక మరేంటో కాని ఇప్పుడు రానా సూపర్‌ స్టార్‌ అంటూ సోషల్‌ మీడియాలో మారుమ్రోగి పోతుంది.

మరిన్ని వార్తలు:

జయ జానకి నాయక ప్రివ్యూ.

‘సాహో’ గురించి ఆసక్తికర విషయం

లై …తెలుగు బులెట్ ప్రివ్యూ.