‘నేనే రాజు నేనే మంత్రి’కు భారీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌

nene raju nene mantri advance booking adurse

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
భారీ అంచనాల నడుమ రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీగా అడ్వాన్స్‌ బుకింగ్‌ అయ్యింది. రేపు విడుదల కాబోతున్న మూడు చిత్రాల్లో ఈ చిత్రానికి ఎక్కువగా అడ్వాన్స్‌ బుకింగ్‌ అయినట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటంతో పాటు, చిత్రానికి విపరీతమైన ప్రమోషన్స్‌ చేయడం వల్ల ఈ స్థాయిలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ అవుతున్నాయని, ఖచ్చితంగా సినిమా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా, అంచనాలకు ఏమాత్రం తీసి పోకుండా ఉంటుందని దర్శకుడు తేజ చెబుతున్నారు. 

రానా, కాజల్‌ల కలయికలో మొదటి సారి వస్తున్న ఈ సినిమాపై యూత్‌ ఆడియన్స్‌లో ఎక్కువగా ఆసక్తి ఉంది. సినిమా విడుదలైన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా తప్పకుండా ఈ సినిమాను ఆధరిస్తారనే నమ్మకంను నిర్మాత సురేష్‌బాబు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో రానా మరియు కాజల్‌ల మద్య రొమాన్స్‌ సినిమాకు హైలైట్‌ అవుతుందని, పొలిటికల్‌ సీన్స్‌ మరియు యాక్షన్‌ సీన్స్‌ మాస్‌ ఆడియన్స్‌ను ఫిదా చేస్తాయని చెబుతున్నారు. మొత్తానికి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం ఉందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఈ చిత్రం రానా కెరీర్‌లోనే(బాహుబలి కాకుండా) అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతుంది.

మరిన్ని వార్తలు:

అఖిల్‌కు గాలం వేస్తున్న బోయపాటి?

జయ జానకి నాయక ప్రివ్యూ.