బెల్లంకొండ మరీ ఇంత స్పీడ్ అవసరమా…?

Bellamkonda Sreenivas Birthday Special Announcement

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శీను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు కానీ ఇప్పటివరకు సరైన హిట్ట్ మాత్రం పడలేదు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక చిత్రం ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన సినిమా అయినా సాలిడ్ హిట్ట్ మాత్రం కొట్టలేక పోయింది. మొన్న ఈ మద్య విడుదలైన కవచం సినిమాకూడా యావరేజ్ టాక్ నే సొంతం చేసుకుంది ఇండస్ట్రీ హిట్ట్ మాత్రం సాయి తో దాగుడు మూతలు ఆడుతుంది. సాయి కి ఉన్న బాడీ లాంగ్వేజ్ కి ఏలాంటి సినిమా అయినా ఇట్టే నప్పుతుంది. కానీ బాడ్ లక్ ను మాత్రం బ్యాక్ పాయింట్ లో పెట్టుకొని తిరుగుతున్నాడు.

ప్రస్తుతం సాయి తేజతో సీత అనే సినిమాలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ కథానాయకగా నటిస్తుంది. ఈ చిత్రం దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రం తరువాత సాయి మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అదికూడా ఈరోజు తన బర్త్ డే కావునా సాయి ఓ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తాడు. ఈ చిత్రాని కోనేరు సత్యనారాయణ….కోనేరు హవిష్ లక్ష్మన్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ కొత్త లుక్ లో కనిపిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనున్నది. ఈ చిత్రంపై సాయి శ్రీనివాస్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఎలాగైనా హిట్ట్ కొట్టాలని గట్టిపట్టుదలతో ఉన్నాడు.