ఆయన నన్ను సంప్రదించలేదు…!

Kiara Advani To Play The Lead In Imtiaz Ali Love Aaj Kal 2

నార్త్ నుండి తెలుగులోకి వచ్చిన మరో ముద్దు గుమ్మ కైరా అద్వాని సూపర్ స్టార్ మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆమె రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చిత్రంలో నటించింది ఈ చిత్రం ఈ నెల 11 న విడుదలకు సిద్దం అవ్వుతుంది. ఆమె నటన, అందం, అభినయం ఇవ్వని తనలో ప్లస్ పాయింట్స్ తెలుగు ఏమాత్రం రాకపోయినా కూడా చాలా చక్కగా నటిస్తుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. టాలీవుడ్ దర్శకులు సైతం కైరా కాల్షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మద్య బాలీవుడ్ లో కైరా పై ఓ పత్రిక కథనం ప్రచురితం మైంది. కైరా బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ గ్రేట్ డైరక్టర్ ఇంతియాజ్ దర్శకత్వంలో సూపర్ హిట్ట్ మూవీ లవ్ అజ్ కల్ చిత్రాని తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దర్శకుడు ఆ చిత్రానికి సీక్వెల్ చేసేపనిలో ఉన్నాడు. ఆ చిత్రంలో హీరోయిన్ కోసం కైరా అద్వానిని ఇంతియాజ్ కలిసినట్లు ఓ పత్రికలో కథనం వచ్చింది. దానికి కైరా ట్విటర్ ద్వారా సమాధానం చెప్పుతూ… ఆ కథనం నిజమైతే భాగుండు. నా ఫేవరేట్ సినిమాలో లవ్ అజ్ కల్ ఒక్కటి నేను ఆ చిత్రాని చాలా సార్లు చూశాను నా మనసుకు నచ్చిన సినిమా అన్నారు. ఆ పత్రికలో వచ్చిన కథనంలో నిజం లేదు నన్ను దర్శకుడు ఇంతియాజ్ కలవలేదు అన్నారు. కానీ ఇంతియాజ్ నన్ను కలవాలని కోరుకుంటున్నా అన్నారు.