టీఆర్ఎస్ కి షాక్…!

KTR Shocking Comments On TRS Leaders

ఇటీవల తెలంగాణలో ముగిసిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించిన సంగాతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 88 స్థానాలను దక్కించుకుంది. పలు పార్టీలు కలిసి ఏర్పడిన ప్రజాకూటమి మాత్రం టీఆర్ఎస్ దెబ్బకు చిత్తు చిత్తుగా ఓడిపోయింది. రాష్ట్రం మొత్తం మీద కూటమికి కేవలం 21 సీట్లే వచ్చాయి. అందులో 19 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, మిగిలిన రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉన్నదని అంతా అనుకున్నారు. ఎవరిని కదిపినా తమ ఓటు ప్రజాకూటమికేనని ఘంటాపథంగా చెప్పారు. కానీ, ఊహించని రీతిలో కూటమి ఓడిపోయింది.

కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలు ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఆ పార్టీ చేసిన అభివృద్ధితో పాటు, కాంగ్రెస్-టీడీపీ పొత్తు, చంద్రబాబు ప్రచారమే గెలిపించాయని భావిస్తుండగా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం చాలా కష్టమనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమయింది. కానీ, ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చొరవ కాంగ్రెస్‌కు కొంత ఊరట లభించినట్లైంది. అంతేకాదు, ఈ పరిణామంతో అధికార టీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఇటీవల జరిగిన ఎమ్మార్ఎఫ్ కార్మిక సంఘం ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బలపరిచిన కేపీఎస్-సీఐటీయూ కూటమి విజయం సాధించింది. ఇందులో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్మిక సంఘం టీఎంఎస్ ఓడిపోయింది. దీంతో ఆ పార్టీ నేతలు ఖంగు తిన్నారు. ఈ పరిణామంతో ఆ పార్టీ నేతలు అధిష్ఠానంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్థానిక నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.