‘లై’ సక్సెస్‌ అయితేనే..!

hanu raghavapudi hopes on Nithin LIE movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘అందాల రాక్షసి’ వంటి ఒక విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఆ తర్వాత నాని హీరోగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. సినిమా సినిమాకు చాలా గ్యాప్‌ తీసుకుంటూ వస్తున్న ఈ దర్శకుడు మూడవ సినిమా అఖిల్‌ హీరోగా తెరకెక్కబోతుందని వార్తలు వచ్చాయి. అంతా ఓకే అనుకున్న తర్వాత అఖిల్‌ కాస్త ఆగమని చెప్పడంతో నితిన్‌తో ‘లై’ చిత్రాన్ని మొదలు పెట్టాడు. అఖిల్‌ మొదటి సినిమా డిజాస్టర్‌ అవ్వడంతో రెండవ సినిమాను హనుతో చేసి ప్రయోగం చేయాలనిపించలేదు. అందుకే అఖిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అఖిల్‌ ప్రస్తుతం తమిళ దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత హను రాఘవపూడికి ఛాన్స్‌ ఇస్తాను అంటూ హామీ ఇచ్చాడు. తాజాగా హను తెరకెక్కించిన ‘లై’ చిత్రం సక్సెస్‌ అయితే, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటే ఖచ్చితంగా అఖిల్‌ పిలిచి మరీ హనుకు ఛాన్స్‌ ఇస్తాడు. కాని ‘లై’ ఫ్లాప్‌ అయితే ఖచ్చితంగా అఖిల్‌ ఛాన్స్‌ తీసుకోడు. అందుకే హనుకు ‘లై’ చిత్రం సక్సెస్‌ చాలా అవసరం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ మరియు ట్రైలర్‌లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. సినిమా బాగుంటుందనే నమ్మకంను కలిగించాయి. మరి సినిమా సక్సెస్‌ అయ్యి అఖిల్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను హను దక్కించుకుంటాడా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

అఖిల్‌కు గాలం వేస్తున్న బోయపాటి?

పతాంజలి సినిమా రాబోతుందా?

నాలుగేళ్లు కుద‌ర‌దు… ప్ర‌భాస్‌