కేసీఆర్ ఓడినప్పుడు.. ఆయన గెలిచారా..?

http://telugubullet.com/wp-content/uploads/2017/06/Jeevan-reddy-won-when-kcr-l.jpg

సీనియర్ కాంగ్రెస్ నేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని అన్ని పార్టీల వారు గౌరవిస్తారు.ఎందుకంటే తన నియోజకవర్గంలో తిరుగులేని ప్రజాదరణతో పాటు అసెంబ్లీలో ఏ విషయం మాట్లాడిన మంచి సబ్జెక్ట్ తో మాట్లాడతారు. అందుకే జీవన్ రెడ్డి అంటే అందరికీ అంత గౌరవం. అయితే ఇంత గౌరవనీయ వ్యక్తిని కూడా ఓడగట్టాలని ఈమధ్య కేసీఆర్ స్కెచ్చులు వేస్తున్నారట. కానీ ఇంతవరకూ దీటైన ప్రత్యర్థి మాత్రం దొరకలేదు.

కేసీఆర్ తెరవెనుక వ్యూహాలు కనిపెట్టిన జీవన్ రెడ్డి.. సమయం వచ్చినప్పుడల్లా గులాబీ బాస్ పై పంచ్ లేస్తున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ కల్లబొల్లి కబుర్లు మాని పని చేయాలంటున్నారు జీవన్ రెడ్డి. నాదెండ్లకు ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ కు రావాల్సి వచ్చిందని , లేదంటే టీడీపీలో ఉండేవాడ్ని కుండబద్దలు కొట్టారు జీవన్ రెడ్డి. 1983లో తాను, కేసీఆర్ ఇద్దరికీ ఎన్టీఆర్ టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు జీవన్ రెడ్డి.

ఎన్టీఆర్ హవాలో తాను గెలిస్తే, కేసీఆర్ ఓడిపోయారని పాత విషయాలు గుర్తుచేసి.. గులాబీ బాస్ కు షాకిచ్చారు. 1996లో చంద్రబాబు, 2001లో కేసీఆర్ ఇద్దరూ తనను వారి పార్టీల్లోకి ఆహ్వానించారని, అయితే ప్రతిసారీ పార్టీలు మారడం తన నైజం కాదన్నారు. ఫ్లోలో టీడీపీలోంచి కాంగ్రెస్ లోకి వచ్చి తప్పు చేశానన్నారు జీవన్ రెడ్డి. అంటే పేరుకి కాంగ్రెస్ లో ఉన్నా. జీవన్ మనసు టీడీపీలోనే ఉన్నట్లు కనిపిస్తోంది.