జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు ఫొటో ఇదిగో!

Jr NTR Second Son first pic

యంగ్ టైగర్ ఎన్‌టిఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి రెండోసారి కూడా పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తారక్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య మరోసారి మగ బిడ్డకు జన్మనిచ్చిందని.. తన కుటుంబం మరింత పెద్దదయిందంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఎన్‌టిఆర్ దంపతులకు 2011లో తొలి సంతానంగా అభయ్ పుట్టగా, ఇప్పుడు రెండోసారి కూడా మరో మగబిడ్డ జన్మించడంతో తారక్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా రెండో కుమారుడి ఫోటో బయటకు వచ్చింది. మీరూ చూసెయ్యండి మరి.

యాక్చువల్లీ సెకండ్‌ బేబీ కోసం ఎన్టీఆర్‌ తన షెడ్యూల్‌ని మార్చుకున్నారట. పొల్లాచ్చిలో జరగనున్న ‘అరవింద సమేత..’ చిత్రానికి ఓ పదిహేను ఇరవై రోజులు గ్యాప్‌ ఇచ్చి, ఆ తర్వాత షూట్‌లో జాయిన్‌ కావాలని భావిస్తున్నారట ఎన్టీఆర్‌.