బ్యాంకుల బాదుడు…తెలియకుండానే !

Just 4 debits can freeze Jan Dhan a/cs

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న ఏకయిక లక్ష్యంతో మోడీ ప్రధాని అయ్యాక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ల విషయంలో కొన్ని బ్యాంకులు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. నెలకు నాలుగు సార్లు జన్ ధన్ అకౌంట్ లకు ఉచిత విత్ డ్రా సదుపాయం ఉంది. 5వ సారి విత్ డ్రా చేస్తున్న సమయంలో కొన్ని బ్యాంకులు కస్టమర్లకు తెలియకుండానే వాటిని రెగ్యులర్ ఖాతాలుగా మార్చేస్తున్నాయని ఐఐటి బొంబాయి ప్రొఫెసర్‌ ఆశిష్‌ దాస్‌ ఒక నివేదికలో తెలిపారు.

ఈ చర్య గురించి కనీసం ఖాతాదారులకు తెలియచేయడం లేదా హెచ్చరించడం కూడా లేదని, బ్యాంకులు ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నాయని ఆ నివేదికలో తెలిపారు. దీనివల్ల అకౌంట్ హోల్డర్ మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టెయిన్ చేయకపోతే.. వారు రెగ్యులర్ పెనాల్టీని భరించవలసి వస్తుంది. ఈ బ్యాంకుల నిర్ణయంతో 31 కోట్ల మంది జన్‌ ధన్ ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని బ్యాంకులు వెనక్కి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ చర్య గురించి కనీసం ఖాతాదారులకు తెలియచేయడం లేదా హెచ్చరించడం కూడా లేదని, బ్యాంకులు ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నాయని ఆ నివేదికలో తేలింది.