పాపం.. ‘కాలా’కే ఎందుకు ఇలా జరుగుతుంది?

Kaala Movie Leaked Of 40 Mins In Singapore

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రజినీకాంత్‌ నటించిన ‘కాలా’ చిత్రం ఎప్పుడో ఆరు నెలల క్రితం విడుదల కావాల్సి ఉంది. కాని ఏదో ఒక అడ్డంకి కారణంగా ఇన్నాళ్లకు విడుదల అయ్యింది. కథ వివాదం, ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌ కాలా వారసుల వివాదం ఇలా అనేక రకాలుగా వివాదాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు విడుదల అయిన ఈ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కానిచ్చేది లేదు అంటూ హెచర్చరికలు, కోర్టుకు వెళ్లి ఏదోలా అనుమతి దక్కించుకున్నారు. ఇంత కష్టపడి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినా కూడా విడుదలైన తర్వాత సినిమాకు సమస్య వచ్చి పడినది. సినిమా విడుదలై కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే సినిమా పైరసీ అయ్యింది. కాలా చిత్రాన్ని సోషల్‌ మీడియాతో పాటు వెబ్‌ సైట్లలో కూడా పోస్ట్‌ చేస్తున్నారు.

‘కాలా’ చిత్రాన్ని మలేషియాలో ప్రీమియర్‌ షో వేయడం జరిగింది. ఆ ప్రీమియర్‌ షోను ఒక ప్రేక్షకుడు ఫేస్‌బుక్‌ లైవ్‌ పెట్టేశాడు. దాదాపు 50 నిమిషాల పాటు ఆ లైవ్‌ వీడియోను అతడు కొనసాగించాడు. అంటే సినిమా ఫస్ట్‌హాఫ్‌ మొత్తానికి కూడా ఫేస్‌బుక్‌ ద్వారా లైవ్‌ టెలికాస్ట్‌ చేయడంతో వేలాది మంది ఆ వీడియోను చూశారు. ఆ తర్వాత ఆ వీడియోను పోస్ట్‌ చేయడంతో భారీ సంఖ్యలో జనాలు ఆ వీడియోను డౌన్‌లోడ్‌ కూడా చేసేసుకున్నారు. మొత్తానికి అప్పుడే కాలా చిత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వెబ్‌సైట్లలో పోస్ట్‌ చేశారు అంటూ సమాచారం అందడంతో ‘కాలా’ నిర్మాతలు లబోదిబో అంటున్నారు. ఫేస్‌బుక్‌లో కొన్ని వెబ్‌ సైట్లలో తీసినప్పటికి ఇంకా కూడా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. కాలా సినిమాకే ఎందుకు ఇన్ని కష్టాలు అంటూ రజినీకాంత్‌ ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.