సెన్సేషనల్ హిట్ అయిన కార్తి సినిమా

సెన్సేషనల్ హిట్ అయిన కార్తి సినిమా

తాజాగా కార్తీ నటించిన ‘ఖైదీ’ తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించింది.  ఇప్పటి వరకు కార్తీ నటించిన అన్ని సినిమాల్లో ఈ మూవీ భారీ కలెక్షన్లు కూడా రాబడుతుంది.   కార్తి కెరీర్లో ఇదివరకే మంచి హిట్లు ఉన్నా ‘ఖైథి’ మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు.   ఎలాంటి గ్లామర్ హీరోయిన్, పాటలు, రొమాన్స్, స్పెషల్ కామెడీ ట్రాక్స్ లాంటి కమర్షియల్ హంగులేవీ లేకుండానే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది.

ఇక సాధారణ ఖైదీ తనను నమ్ముకున్న పోలీసులకు ఎలా సహాయపడతాడు..తన కూతురుని ఎలా కలుసుకుంటాడు అన్న కథాంశంతో సాగింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈమధ్య కాలంలో రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ తరహా చిత్రం ఇంకొకటి లేదు.

కంటెంట్ బాగుంటే ఎలాంటి మూవీస్ అయినా ఆదరిస్తారని మరోసారి రుజువైంది.అందుకే  పంపిణీదారులకు మంచి లాభాల్ని అందించింది. ఈ మూవీతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం స్టార్ డైరెక్టర్ అయ్యారు. ప్రస్తుతం విజయ్ తో ఓ సినిమాను చేస్తున్నారు.  అంతే కాదు అతనికి కమల్ హాసన్ నుండి కూడా పిలుపు వచ్చినట్టు కోలీవుడ్ టాక్.