మరోస్టార్‌ను చంపేసిన సోషల్‌ మీడియా

Kaikala Satyanarayana Fake Death News in Social Media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈమద్య కాలంలో సోషల్‌ మీడియా ఏ రేంజ్‌లో పుంజుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా చిన్న విషయం సోషల్‌ మీడియా ద్వారా కొన్ని సెకన్లలోనే ప్రపంచ వ్యాప్తంగా తెలిసి పోతుంది. కొన్ని సార్లు పుకార్లు, తప్పుడు వార్తలు కూడా దావాణంలా వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా సినిమా తారల గురించిన వార్తలు ఎక్కువగా సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచానికి తెలుస్తున్నాయి. నిజమైన వార్త కంటే కొన్ని పుకార్లు ఎక్కువ వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఆమద్య స్టార్‌ కమెడియన్‌ వేణుమాధవ్‌ చనిపోయాడు అంటూ పుకార్లు వచ్చాయి. ఆయన తాను బతికే ఉన్నాను అంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా పలువురు స్టార్స్‌ను కూడా సోషల్‌ మీడియా చంపేసింది.

Kaikala Satyanarayana Fake Death

తాజాగా సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ చనిపోయాడు అంటూ పుకార్లు పుట్టించారు. సత్యనారాయణ అనే ఒక నటుడు చనిపోయిన మాట వాస్తవమే. కాని కాస్త కామ్యూనికేషన్‌ గ్యాప్‌ కారణంగా కైకాల సత్యనారాయణ చనిపోయాడు అంటూ ప్రచారం జరిగింది. ఆ వార్తలపై మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ స్పందించింది. చనిపోయింది కైకాల సత్యనారాయణ కాదని, ఆయన ఆరోగ్యంగా బాగానే ఉన్నాడని, మరో నటుడు అయిన సత్యనారాయణ అంటూ క్లారిటీ ఇవ్వడంతో సోషల్‌ మీడియా పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది. ఇలా సోషల్‌ మీడియాలో పలువురు స్టార్స్‌ ఇప్పటికే చనిపోయారు, మళ్లీ బతికారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా సోషల్‌ మీడియా జనాలు మాత్రం పద్దతి మార్చుకోవడం లేదు. ఒక వార్త సగం తెలియగానే పూర్తిగా తెలుసుకోకుండా పోస్ట్‌ చేసేస్తున్నారు.