ఆ సినిమా కాజల్ ఇమేజ్ ని తగ్గిస్తుందా?

ఆ సినిమా కాజల్ ఇమేజ్ ని తగ్గిస్తుందా?

కాజల్ అగర్వాల్ అనగానే ఆమె గ్లామరే గుర్తొస్తుంది తప్ప.. పెర్ఫామెన్స్ గుర్తు రాదు. కెరీర్ ఆరంభం నుంచి ఆమె ఎక్కువగా గ్లామర్ క్యారెక్టర్లే చేస్తోంది. ఆమెకు కోట్ల మంది అభిమానులు తయారవడానికి కూడా గ్లామరే కారణం. 30 ఏళ్లు పైబడ్డా ఇప్పటికీ తన అందంతో ఆకర్షణ మంత్రం వేస్తూనే ఉంది చందమామ. ఆమె డీగ్లామరస్ రోల్స్ చేస్తే జనాలు హర్షించే పరిస్థితి లేదు. కాజల్ కూడా అలాంటి ప్రయత్నాలు పెద్దగా చేసింది లేదు. ‘సీత’ సినిమాలో నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేసినప్పటికీ గ్లామర్ మాత్రం మిస్ కాలేదు. అందులోనూ చాలా సెక్సీగానే కనిపించింది. ఐతే ఇలాంటి ఇమేజ్, ట్రాక్ రికార్డు ఉన్న కాజల్‌ను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్.. ఒక షాకింగ్ లుక్‌లో చూపించబోతున్నాడన్నది తాజా సమాచారం.

కమల్ హాసన్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న ‘భారతీయుడు-2’లో కాజల్ ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ మరో హీరోయిన్. ఐతే ‘భారతీయుడు’లో సుకన్య చేసిన వృద్ధురాలి పాత్ర కొనసాగింపుగా కాజల్ పాత్ర ఉంటుందని అంటున్నారు. వృద్ధ కమల్ హాసన్‌కు జోడీగానే ఆమె కనిపించనుందట. ‘భారతీయుడు-2’లో కమల్ 90 ఏళ్ల వ్యక్తిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆయనకు జోడీగా కాజల్ 85 ఏళ్ల వయసు వృద్ధురాలిగా కనిపిస్తుందట. ఐతే ఒకప్పుడు సుకన్య ఇలాంటి పాత్ర చేసిందంటే ఆమెకున్న ఇమేజ్ వేరు. జనాలు ఫీలవ్వలేదు. కానీ కాజల్ ఇమేజ్ వేరు. గ్లామర్ క్వీన్ అయిన కాజల్‌ను ఇంత డీగ్లామరస్‌ రోల్‌లో, అంత వృద్ధురాలిగా చూపిస్తే అభిమానులు తట్టుకోగలరా అన్నది డౌటు. ఐతే గ్లామర్ హీరోయిన్‌గా తనకున్న గుర్తింపు పోయి, పెర్ఫామర్ అనిపించుకోవడానికే కాజల్ ఈ పాత్ర ఒప్పుకున్నట్లుగా ఉంది.