కళ్యాణ్‌ రామ్‌ అనుకున్నాడు, కాని కుదరలేదు…!

Kalyan Ram Want To Make A Film With NTR

నందమూరి హరికృష్ణ మరణం ఆయన కుటుంబ సభ్యుల్లో తీవ్ర శోఖంను మిగిల్చింది. హరికృష్ణ ఇద్దరు తనయులు అయిన కళ్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌లు తీవ్ర దుఖ:లో మునిగి పోయారు. ఈ సమయంలోనే కళ్యాణ్‌ రామ్‌ గతంలో కోరుకున్న ఒక కోరిక గురించి అభిమానుల్లో చర్చ జరుగుతుంది. గత కొంత కాలంగా నందమూరి బ్రదర్స్‌ కళ్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌లు తరుచు సినిమా వేదికలపై, ప్రైవేట్‌ పార్టీల్లో కనిపిస్తూ వస్తున్నారు. ఈ సమయంలోనే వీరిద్దరు కలిసి ఒక చిత్రంలో నటిస్తే చూడాలని ఫ్యాన్స్‌ కోరుకున్నారు. ఒకానొక సందర్బంలో కళ్యాణ్‌ రామ్‌ కూడా తమ్ముడితో కలిసి నటించాలనుంది అంటూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు చేయడం జరిగింది.

kalyan-ntr

ఎన్టీఆర్‌తో తాను ఒక చిత్రాన్ని నిర్మించి, ఆ చిత్రంలో నేను, నాన్న నటించాలని కోరుకుంటున్నా అని కూడా గతంలో కళ్యాణ్‌ రామ్‌ పేర్కొన్నాడు. త్వరలోనే ఈ ముగ్గురి కలయికలో సినిమా ఉంటుందని అంతా భావించారు. ఈ ముగ్గురి కలయిక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే ఇలా జరగడంతో నందమూరి ఫ్యాన్స్‌ షాక్‌కు గురి అవుతున్నారు. కళ్యాణ్‌ రామ్‌ కోరిక తీరకుండానే హరికృష్ణ చనిపోవడంతో ఫ్యాన్స్‌ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్‌ రామ్‌ ఆ కోరిక ఎప్పటికి తీరకుండా పోయింది. మరి ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ల కాంబినేషన్‌లో అయినా చిత్రం వస్తుందేమో చూడాలి.

kalyan-ram-ntr-harikrishna