రెండు పడల ప్రయాణం నా వల్ల కాదు…!

Kamal Haasan's Journey From Stardom To Political

తమిళ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నాడు. కొన్నాళ్ల పాటు రాజకీయాలతో పాటు సినిమాలు చేయాలని కమల్‌ భావించాడు. విశ్వరూపం 2 చిత్రం ప్రమోషన్‌ సమయంలో కమల్‌ తన భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించాడు. అప్పట్లో ఎంజీఆర్‌ ఎమ్మెల్యేగా చేస్తూ కూడా సినిమాల్లో హీరోగా నటించాడు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, తాను అలా చేయడం అసాధ్యం అంటూ కమల్‌ హాసన్‌ చెప్పుకొచ్చాడు. అందుకే ఇకపై పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా కమల్‌ ప్రకటించాడు. సినిమాల్లో నటించేది లేదని తేల్చి చెప్పాడు.

Kamal Haasan's Journey From Stardom To Political

కమల్‌ ప్రస్తుతం శభాష్‌ నాయుడు చిత్రం సగం చేశాడు, త్వరలో భారతీయుడు 2 చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. శభాష్‌ నాయుడు పూర్తి చేసే అవకాశం ఉన్నా కూడా ఇప్పుడు కమల్‌ భారతీయుడు 2 చిత్రాన్ని చేస్తాడా లేదా అనే విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కమల్‌ నో చెప్పడం వల్ల దర్శకుడు శంకర్‌ బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌తో ఈ చిత్రాన్ని చేయాలని ఫిక్స్‌ అయినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇటీవల భారతీయుడు 2 చిత్రంలో అజయ్‌ దేవగన్‌ నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే కమల్‌, అజయ్‌ దేవగన్‌ కలిసి నటించబోతున్నారా లేదంటే కమల్‌ తప్పుకోవడంతో ఆ స్థానంలో అజయ్‌ దేవగన్‌ వచ్చాడా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కమల్‌ ఈ చిత్రం చేస్తున్నాడా లేదా అనే విషయంలో ప్రస్తుతం సస్పెన్స్‌ కొనసాగుతుంది.