జగన్ భార్య ఇప్పుడు A5, భారతి సిమెంట్స్ కేసులో పేరు నమోదు !

ys-bharathi-as-a5-in-money-laundering-case

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన భార్య భారతిపై అభియోగాలు నమోదయ్యాయి. జగన్ ఆస్తుల కేసులకు సంబంధించిన ఛార్జ్ షీటులో ఆయన భార్య భారతి పేరును తాజాగా ఈడీ చేర్చింది. భారతీ సిమెంట్స్‌కు సంబంధించి హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీటులో ఆమెను ఏ5గా చేర్చినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలైంది.
రఘురాం సిమెంట్స్ అనే సంస్థను జగన్ చాలా తక్కువ ధరకు కొనుగులు చేసి దాన్ని భారతి సిమెంట్స్‌గా మార్చారు. రఘురాం సిమెంట్స్ భారతి సిమెంట్స్ అయిన వెంటనే ఆ సంస్థకి క్విడ్ ప్రో కో రూపంలోకి వందల కోట్ల పెట్టుబడులు వచ్చి పడ్డాయి.

YS Bharathi as A5 in Money laundering case

మరో విచిత్రం ఏమిటంటే పోటీ సిమెంట్ సంస్థలైన ఇండియా సిమెంట్స్ లాంటి కొన్ని సంస్థలు కూడా ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాని భారతి సిమెంట్స్ సంస్థకి సంబందించిన చాలా తక్కువ షేర్లు చాలా పెద్ద మొత్తానికి కొనుగోలు చేసింది. ఇక ఆ తదుపరి పూర్తి స్థాయిలో ఇంకా ఉత్పత్తి కూడా ప్రారంభం కాక మునుపే ఈ భారతి సిమెంట్ లలో 51 శాతం వాటను ఫ్రాన్స్‌కు చెందిన వికాట్ అనే సంస్థకు దాదాపుగా రూ. 2వేల కోట్లకు అమ్మేశారు.

జగన్ భార్య ఇప్పుడు A5, భారతి సిమెంట్స్ కేసులో పేరు నమోదు ! - Telugu Bullet

అనుమానాస్పదంగా ఉన్న ఈ లావాదేవీలన్నింటిపైనా సీబీఐ ఇప్పుడు విచారణ జరుపుతోంది. రఘురామ్ సిమెంట్స్ ఒప్పందంలో వైఎస్ భారతి అనే పేరుతో డబ్బు లావాదేవీలు జరిగాయని ఈడీ పేర్కొంది. రఘురామ్(భారతి) సిమెంట్స్‌లో సండూర్ పవర్, కారమేల్ ఏషియా లిమిటెడ్, ఇతర కంపెనీలు హవాలా ద్వారా నిధులను మళ్లించినట్లు ఆరోపించింది. ఇప్పటికే ఈ కేసులో జగన్, విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్ కార్పొరేషన్, జే.జగన్మోహన్ రెడ్డి, సిలికాన్ బిల్డర్, సండూర్ పవర్ లిమిటెడ్ క్లాసిక్ రియాలిటీ, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో పాటు ఆమె పేరును ఏ5గా చేర్చింది. సీబీఐ గతంలో దాఖలు చేసిన 11 ఛార్జ్ షీట్లలో భారతీ పేరులేకపోగా తాజాగా ఆమె పేరును ఈడీ చేర్చడం చర్చనీయాంశంగా మారింది.