కమల్‌ అబద్దం చెప్తున్నాడు

kamal Hasan Lied About Vishwaroopam 2 Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

kamal Hasan Lied About Vishwaroopam 2 Movie

కమల్‌ దాదాపు అయిదు సంవత్సరాల క్రితం ‘విశ్వరూపం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాతోనే ‘విశ్వరూపం 2’ చిత్రాన్ని కూడా తెరకెక్కించడం జరిగింది. ‘విశ్వరూపం’ విడుదలైన సమయంలో ‘విశ్వరూపం 2’ చిత్రానికి సంబంధించి 25 శాతం షూటింగ్‌ పార్ట్‌ మిగిలి ఉందని అప్పుడు కమల్‌ హాసన్‌ స్వయంగా ప్రకటించాడు. ఆ తర్వాత వెంటనే ‘విశ్వరూపం 2’ చిత్రం మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేశారు. షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత విడుదలకు ఈ సినిమా ఇబ్బందులు ఎదుర్కొంది.

షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఆరు నెలల వరకు సినిమా విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కమల్‌ హాసన్‌ మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతూ వచ్చారు. అయితే ఆర్థిక కారణాలు మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమా విడుదల కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో కమల్‌ మాట్లాడుతూ ‘విశ్వరూపం 2’కు సంబంధించిన చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు అని, మిగిలిన పార్ట్‌ పూర్తి చేసి ఆ తర్వాత విడుదల చేస్తామని అంటున్నాడు. విశ్వరూపం 2 షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా కాలం అవుతుంటే ఎందుకు కమల్‌ ఇలా అబద్దం చెబుతున్నాడో అర్థం కావడం లేదు. సినిమాలో ఏవైనా సీన్స్‌ రీ షూట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో కమల్‌ ఇలా చెప్పి ఉంటాడని కొందరు అంటున్నారు. మొత్తానికి విశ్వరూపం 2 విడుదల ఎప్పుడు అయ్యేనో కాని సంవత్సరాలుగా ఎదురు చూపులు చూసేలా చేస్తుంది.

మరిన్ని వార్తలు:

ప్రభాస్‌కు 150 కోట్ల ఆఫర్‌!

నిర్ణయం’ నుండి అఖిల్‌ టైటిల్‌!