నిర్ణయం’ నుండి అఖిల్‌ టైటిల్‌!

Akkineni-Prince-Akhil-Secon

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Akkineni Prince Akhil Second Movie Title Fix

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మొదటి సినిమాతో ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పర్చాడు. మొదటి సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో అఖిల్‌ కూడా చాలా నిరుత్సాహ పడ్డాడు. మొదటి సినిమాకు జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ అఖిల్‌ రెండవ సినిమా చేస్తున్నాడు. చాలా చాలా కథలు విన్న తర్వాత ‘మనం’, ‘ఇష్క్‌’ వంటి విభిన్న చిత్రాలను అందించిన దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ రెండవ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్‌గా ‘జును’ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దాంతో అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు అంతా కూడా టైటిల్‌పై వ్యతిరేకంగా స్పందించారు. దాంతో తాజాగా కొత్త టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

నాగార్జున, అమల జంటగా నటించిన ‘నిర్ణయం’ చిత్రంలోని హలో గురు ప్రేమ కోసమే.. అనే పాటలోని మొదటి పదాలను తీసుకుని టైటిల్‌గా ఫిక్స్‌ చేశారు. ‘నిర్ణయం’ చిత్రంలోని ఆ పాట సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇప్పటి కూడా ఆ పాట ప్రేక్షకుల నోళ్లల్లో నానుతూనే ఉంది. అందుకే అఖిల్‌ రెండవ సినిమాకు హలో గురు ప్రేమకోసమే అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల అక్కినేని ఫ్యామిలీకి పెద్ద టైటిల్స్‌ అంటే ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ లాంటివి వర్కౌట్‌ అవుతున్నాయి. అందుకే అఖిల్‌కు కూడా కాస్త లెంగ్త్‌ ఎక్కువ అయిన పర్వాలేదు అని ‘హలో గురు ప్రేమకోసమే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమా విడుదల చేయాలని నాగార్జున భావిస్తున్నాడు.

మరిన్ని వార్తలు

పవన్‌ మూవీలో వెంకీ ఏంటి?

అందం కోసం ఆపరేషన్‌పై స్పందించింది

నిర్ణయం’ నుండి అఖిల్‌ టైటిల్‌! - Telugu Bullet