ప్రభాస్‌కు 150 కోట్ల ఆఫర్‌!

Prabhas Next Movie Offer For 150 Croes In karan johar

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Karan Johar Big Offer To Prabhas For Movie

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’ సినిమాతో బాలీవుడ్‌ హీరోలను కూడా మించి పోయాడు. దేశ వ్యాప్తంగా అత్యంత గుర్తింపు కలిగిన హీరోల జాబితాలో ప్రభాస్‌ నిలిచాడు. బాలీవుడ్‌ హీరోలు ఉత్తరాదిన మాత్రమే ఫ్యాన్స్‌ను కలిగి ఉంటారు. కాని ప్రభాస్‌ మాత్రం సౌత్‌ మరియు నార్త్‌ అంటే అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. అందుకే ప్రభాస్‌తో సినిమాలు నిర్మించేందుకు భారీ బడ్జెట్‌తో నిర్మాతలు క్యూలో ఉన్నారు. తాజాగా కరణ్‌ జోహార్‌ ఇచ్చిన ఒక పార్టీలో ప్రభాస్‌ పాల్గొన్నాడు. ఆ పార్టీలో ప్రభాస్‌తో కరణ్‌ ఏకంగా 150 కోట్ల డీల్‌ కుదుర్చుకున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

బాలీవుడ్‌లో ప్రభాస్‌తో కరణ్‌ జోహార్‌ సినిమాలు నిర్మించేందుకు ఈ డీల్‌ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్ని సినిమాలకు, ఎప్పుడు ఆ సినిమాలు వచ్చేది అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం ‘సాహో’ సినిమాలో ప్రభాస్‌ నటిస్తున్నాడు. సుజీత్‌ దర్శకత్వంలో దాదాపు 150 కోట్లకు పైబడిన బడ్జెట్‌తో హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘సాహో’ సినిమాను యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌లు నిర్మించబోతున్నారు. ‘సాహో’ చిత్రాన్ని కూడా బాలీవుడ్‌లో కరణ్‌ జోహార్‌ పంపిణీ చేసేందుకు హక్కులు దక్కించుకున్నాడు. ‘సాహో’ తర్వాత ప్రభాస్‌ బాలీవుడ్‌లో సినిమా చేసే అవకాశం ఉంది.


మరిన్ని వార్తలు :

పవన్‌ మూవీలో వెంకీ ఏంటి?

అందం కోసం ఆపరేషన్‌పై స్పందించింది