కాణిపాక వినాయకుడి గుడిచరిత్ర – ప్రాముఖ్యత..

kanipakam Vinayaka Temple history and Importance

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు ఉన్నాయి. అయితే ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర తప్పకుండా ఉంటుంది. మరి ఈరోజు మనం కాణిపాకం వినాయకుడి చరిత్ర తెలుసుకుందాం. ఈ ఆలయం మీకు బాగా తెలిసేఉంటుంది, చాలా సార్లు వెళ్లి ఉంటారు కూడా.. మరి  ఈ ఆలయం యొక్క చరిత్ర,  వాటివిశేషాలు మీకు తెలుసా…?  చాలా వరకూ ఎవరికీ తెలియవు. ఈ దేవాలయం లో ప్రత్యేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా… అయితే రండి మరి విశేషాలేమిటో చూద్దాం..

kanipakam Vinayaka Temple history and Importance

కాణిపాకం వినాయకుడుకి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లోనిచిత్తూరు జిల్లాలో ఇరాలా మండలంలో బాహుడా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో కాణిపాకం వినాయకుడు వెలిశాడు. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది.  కాణి అంటే తడి భూమి పాకం అంటే తడి భూమిలోకి ప్రవహిస్తున్న నీరు అని అర్థం.

Kanipakam-Vinayaka-Temple

మొట్టమొదట ఈ ఆలయాన్ని స్థాపించింది ఎవరు? అసలు ఈ ఆలయానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? అసలు కథ ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

Kanipakam-Vinayaka-Temple

ఒక చిన్న గ్రామంలో అంగవైకల్యంతో ఉండే ముగ్గురు సోదరులు ఉండేవారు.  వారిలో ఒకరికి చెవి, మరొకరికి నోరు, ఇంకొకరికి కళ్ళు పనిచేయవు. వారు ఎప్పుడూ అంగవైకల్యంతో బాధపడకుండా కష్టపడి పనిచేసి ఒక భూమిని సాగు చేసుకుంటున్నారు.

Kanipakam-Vinayaka

దగ్గరలో ఉన్న ఒక బావిలో, వారి వ్యవసాయ పనులకు కావలసినంత నీరు నిత్యం వాడుకునే వారు. కానీ ఆ బావి క్రమంగా ఎండిపోవడంతో, వారిలో ఒకరు దానిని తవ్వే ప్రయత్నం చేశారు. తవ్వడం మొదలు పెట్టిన కొంత సేపట్లోనే వారికి బావిలో ఏదో వున్నట్లనిపించింది. ఇంకాస్త తవ్వేలోగా అక్కడ నుంచి రక్తం ఏరులై పారి బావి అంతటా నిండి పోయింది.

history-of--Kanipakam-vinay

ఆశ్చర్యపోయి చూసిన అన్నదమ్ములకి అందులోనుంచి ఒక వినాయకుడి విగ్రహం కనిపించింది. స్వయంగా అక్కడ వెలిసిన వినాయకుడు ఆ ముగ్గురి అంగవైకల్యాన్ని తొలగించాడు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయి, దేవునికి పూజలు చేయడం మొదలుపెట్టారు. సుడిగాలి జలాల నుండి  ఉద్భవించడం వల్ల దేవుడిని బయటకు తీయడం కష్టసాధ్యం అయ్యింది. ప్రజలందరూ వినాయకుడు స్వయంగా వెలిశాడని స్వయంభు వినాయక స్వామి అని అంటారు. క్రమంగా దేవుడికి ఆలయం నిర్మించి కాణిపాకం వినాయక స్వామిగా కొలవడం మొదలు పెట్టారు.ఆ తరువాత అది కాణిపాకం వినాయక స్వామి ఆలయంగా ప్రచారంలోకి వచ్చింది. ఇది.. కాణిపాకం వినాయక స్వామి ఆలయ చరిత్ర..

Sri-Swayambu-Varasidhi-Vina

ఇప్పటికీ కూడా సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి విగ్రహం సగభాగం నీటిలో మునిగి ఉంటుంది. ఆ బావిలో నీటినే అక్కడ అర్చకులు భక్తులకు తీర్ధంగా అందిస్తారు. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం ఇప్పటికీ ఎవ్వరు కనుగొన లేకపోయారు.ఆలయ అర్చకులు ఎల్లవేళలా స్వామివారికి అష్టోత్తర పూజలతో పాటు పండుగ సమయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఇక వినాయక చవితి ఉత్సవాలని తిలకించడానికి మన రెండుకళ్ళూ సరిపోవు సుమా…ఇక వర్షాకాలంలో అయితే బావి నుంచి పవిత్రమైన నీరు రావడం మనం గమనించవచ్చు.

vinayaka

ఇంతటితో ఈ దేవుడి కథ సమాప్తం అని అనుకుంటున్నారా… కాదు ఈ ఆలయానికి ఇంకా చాలా మహిమలు ఉన్నాయి…అందులో మీకు కొన్ని తెలిసే ఉంటాయి.. మరి తెలియని విశేషాలు ఏమిటో తెలుసుకోండి…

kanipaka-vinayaka

ఈ విగ్రహంలో అద్భుతమైన వింత లక్షణం ఏమిటంటే ఇప్పటికీ కూడా వినాయకడి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. అందులో

vinayaka-templie--Kanipakam

ఒకటేమిటంటే… 50 సంవత్సరాల క్రితం శ్రీమతి లక్ష్మమ్మ అనే భక్తురాలు వినాయకుడి కోసం ఒక వెండి కవచం తయారు చేయించారు.  క్రమంగా పెరుగుతున్న విగ్రహ పరిమాణం వల్ల ప్రస్తుతం వినాయకుడికి ఆ కవచం పట్టడం లేదు. ఇదే సాక్షాత్తు వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు అనడానికి ఒక నిదర్శనం. ఈ ఆలయానికి గల మరో ప్రాముఖ్యత ఏమిటంటే. ప్రజలకు ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ స్వామి వద్దకు వచ్చి ప్రమాణాన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్య పరిష్కారమవుతుందని అని ఒక నమ్మకం. అంతేకాకుండా పాపము చేసిన వ్యక్తి  గుడిలోకి  ప్రవేశించడానికి ముందే తన తప్పులు అంగీకరిస్తారు. శ్రీ వరసిద్ధి వినాయకని  వైభవం విస్తృతంగా వ్యాప్తి చెంది దర్శనీయ ప్రదేశమైంది.

కాణిపాక వినాయకుడి గుడిచరిత్ర - ప్రాముఖ్యత.. - Telugu Bullet

వరసిద్ధి వినాయకుడి ఆలయం ఎదురుగా ఒక వినూత్నమైన మండపంతో నీటి కోనేరు ఉంటుంది. వాయువ్వ దిశలో “బ్రహ్మహత్యా పాతక నివృత్తి” కోసం శివుడి ఆజ్ఞ మేరకు నిర్మించిన మరకతంభికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం ప్రసిద్ధిచెందింది. అక్కడ షణ్ముఖ,దుర్గ దేవి విగ్రహాలు దర్శనార్థమై ఉంటాయి. ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఎల్లప్పుడూ ఒక మణి తో కూడిన సర్పము దర్శనమిస్తుంది. దేవతల సర్పంగా కొలవబడే ఈ పాము ఎవ్వరికీ ఎటువంటి హానీ చెయ్యదు అని అక్కడి భక్తులు చెప్పుతూ ఉంటారు. ఇక తూర్పు-ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం ఉంటుంది. శ్రీ మహా విష్ణువు, జనమేజయుడి కలలో కనిపించడంతో ఈ ఆలయ నిర్మాణం ప్రాకారం చుట్టుకుంది అంటారు. ఈ ఆలయంలో నవగ్రహాలు మండపం, అద్దాలమేడ కూడా ఉంటుంది. ప్రసిద్ధి కరమైన ఆంజనేయస్వామి గుడి కూడా కాణిపాకo లో దర్శనమిస్తుంది. దాదాపుగా, కాణిపాకం చుట్టూ అది సుమా ఊరులో మూడవ వంతు వరకు వివిధ ఆలయాలలో నిండి ఉంటుంది.

Sri-Varasiddhi

కాణిపారకం వినాయకుడిని చేరుకుననే భక్తులు వివిధ మార్గాలు ఎంచుకుంటారు!

temple

రోడ్డు:

తిరుపతికి సుమారు 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి  15 నిమిషాలు పడుతుంది. చిత్తూరు నుంచి వచ్చే భక్తుల కోసం ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు సౌకర్యం కలదు. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును.

kanipaka

రైలు ద్వారా:

ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచైనా చిత్తూరుకు లేదా, రేణిగుంట లేదా, గూడూరు లకు రైళ్ళు కలవు. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభంగా కాణిపాకం చేరుకోవచ్చు.

విమానం ద్వారా:

రేణిగుంట విమానాశ్రయం ద్వారా కూడా కాణిపారకం వినాయకుడి  ఆలయం చేరుకోవచ్చు

temple-special