విగ్రహాన్ని కడగొచ్చు మరి గతాన్ని ?

Lakshmi Parvathi scared because of Lakshmi's Veeragrandham shooting start

Posted November 14, 2017 at 13:08 
లక్ష్మీస్ వీరగ్రంధం సినిమా అనౌన్స్ మెంట్ మొదలైన దగ్గర నుంచి లక్ష్మీపార్వతి కి నిద్రపట్టడం లేదు. ఆ సినిమా షూటింగ్ ఆపడానికి విశ్వప్రయత్నం చేసి ఫెయిల్ అయిన ఆమె ఇప్పుడు లక్ష్మీస్ వీరగ్రంధం ముహూర్తపు షాట్ చిత్రీకరించిన ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్లి పాలతో శుద్ధి చేశారు. లక్ష్మీపార్వతి ఈ స్థాయిలో లక్ష్మీస్ వీరగ్రంధం గురించి భయపడడం చూసి చాలా మంది ఆమె గతంలో ఏమి జరిగిందో అన్న ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే లక్ష్మిప్వార్వతి చర్యలతో లక్ష్మీస్ వీరగ్రంధం సినిమా కి క్రేజ్ పెరుగుతోంది. ఈ సినిమాను ఢీకొట్టడానికి రామ్ గోపాల్ వర్మ సీన్ లో ఉంటే ఎలా ఉండేదో గానీ ఆయన నాగ్ సినిమా పనిలో పడడంతో లక్ష్మీపార్వతి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

kethireddy-jagadishwar-redd

లక్ష్మీపార్వతిలో ఈ ఉలికిపాటు చూసి లక్ష్మీస్ వీరగ్రంధం టీం ఇంకాస్త రెచ్చిపోతోంది. ఆ టీం కి చెందిన ఓ ముఖ్య వ్యక్తి లక్ష్మీపార్వతి చర్యల మీద ప్రైవేట్ సంభాషణల్లో ఫైర్ అయిపోతున్నారు. సినిమా లో లక్ష్మీపార్వతి గతానికి సంబంధించి కీలక రహస్యాలు ఉన్నట్టు కూడా ఆయన చెబుతున్నారట. ఇంకా ఆయన చేస్తున్న ఓ కామెంట్ మీద ఫిలిం నగర్ లో ఒకటే రచ్చ అవుతోంది. ఇంతకీ ఆయన అన్న ఆ డైలాగ్ ఇదే … “లక్ష్మీస్ వీరగ్రంధం షూటింగ్ జరిగిందని ఎన్టీఆర్ ఘాట్ ని శుద్ధి చేసిన లక్ష్మీపార్వతి గతాన్ని ఎలా కడుగుతుంది?”. ఈ డైలాగ్ చూస్తుంటే లక్ష్మీస్ వీరగ్రంధం రిలీజ్ తర్వాత పెద్ద రచ్చ జరిగేట్టు వుంది.

SHARE