మీడియాకి మేమంటే ఎందుకంత ద్వేషం !

bjp-kanna-lakshmi-narayana-ask-media-why-they-hate

కడప స్టీఏపీ బీజేపీ అధ్యక్ష్యుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రెస్ మీట్ లోని మెయిన్ పాయింట్స్ మీ కోసం

  • రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని మీడియాలో వార్తలు రాయడం ఎంతవరకు కరెక్ట్..
  • గతంలోను బ్యాంకింగ్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా వార్తలు రాశారు..
  • కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ పై కేంద్ర ప్రభుత్వం కోర్ట్ లో వేసిన ఆపిడివిట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
  • రైల్వే జోన్ అనేది రాజకీయ నిర్ణయం..
  • జోన్ ఇస్తామని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు..
  • పత్రికకలకు బీజేపీ అంటే ఎంత అంత ద్వేషమో తెలియడం లేదు..
  • రాజకీయ పార్టీలకు దురుద్దేశాలు ఉంటాయి.. మీడియాకు ఎందుకు దురుద్దేశాలు ఉన్నాయో అర్థం కావడంలేదు..
  • రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది..
  • చంద్రబాబుకు ఒంగోలు వెళ్లి ధర్మ పోరాట దీక్ష పెట్టడానికి సిగ్గు ఉందా..
  • దాదాపు పూర్తయైన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి చంద్రబాబు ఏమి చేశారు…
  • చంద్రబాబు అనుభవాన్ని అవినీతి చేయడానికి ఉపయోగిస్తున్నారు..
  • హోదాపై అనేక సార్లు మాట మార్చిన చంద్రబాబు కు ఏమి పరికత్వత ఉంది..
  • రాష్ట్ర అభివృద్ధి పై చంద్రబాబుతో చర్చ చేయడానికి మోడీ అవసరం లేదు…
  • చంద్రబాబు స్థాయికి నేను చాలు..
  • చంద్రబాబు దమ్ముంటే నాతో చర్చకు రావాలి..
  • హిందూత్వపై చంద్రబాబు దాడికి దిగుతున్నారు..
  • శివ స్వామిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు..
  • ఎన్నికల్లో గెలవడం కోసమే చంద్రబాబు కాపు రిజర్వేషన్లు అంశాన్ని ఎత్తుకున్నారు..
  • 2004 సంవత్సరంలో ముద్రగడ రిజర్వేషన్లు కోసం పోరాటం చేస్తే చంద్రబాబు కాపు రిజర్వేషన్లు తీవ్రంగా వ్యతిరేకించారు..
  • చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు..
  • రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం పంపుతామని చంద్రబాబు చెప్పలేదు..
  • ఉద్యమం చేసిన కాపులను చంద్రబాబు అనేక ఇబ్బందులకు గురిచేశారు..
  • తుని ఘటనలో కాపులపై చంద్రబాబు అనేక తప్పుడు కేసులు పెట్టించారు
  • ముద్రగడ కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారు..
  • రిజర్వేషన్ పై చంద్రబాబు నాలుగున్నర ఏళ్ళు కాలయాపన చేశారు..
  • బీసీ కమిషన్ చైర్మన్ రిపోర్ట్ ఇవ్వకుండా రిజర్వేషన్ అంశాన్ని చంద్రబాబు కేంద్రంకు పంపారు..
  • బీసీ నాయకులను చంద్రబాబు రెచ్చగొట్టి కాపులపై దాడులు చేయించారు..
  • బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ల అంశంపై బీజేపీ ప్రయత్నిస్తోంది.
  • రిజర్వేషన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పై చంద్రబాబు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు..