Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటసింహం బాలకృష్ణ, తమిళ దర్శకుడు కె.ఎస్. రవికుమార్, నిర్మాత సి.కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం షూటింగ్ చురుగ్గా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ గురించి ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. బాలయ్య 102 వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకి ఇంతకు ముందు జయసింహ, లక్ష్మి నరసింహారెడ్డి వంటి టైటిల్స్ ప్రచారంలో వున్నాయి. తాజాగా ఈ సినిమాకి చిత్ర యూనిట్ ” కర్ణ” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పౌరాణిక పాత్ర పేరు సాంఘిక సినిమాకి వాడుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఈ సినిమా టీం కూడా అదే సెంటిమెంట్ మీద ఆధారపడుతోంది.
” కర్ణ ” టైటిల్ గనుక ఈ సినిమాకి ఫిక్స్ అయితే తెలుగు సినిమాల్లో వస్తున్న నాలుగో కర్ణుడు బాలకృష్ణ అవుతాడు. అదెలాగంటే … ” కర్ణ” టైటిల్ తో అప్పుడెప్పుడో శివాజీ గణేశన్ హీరోగా ఓ సినిమా, ఎన్టీఆర్ హీరోగా ఇంకో సినిమా వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో వచ్చిన ఆ రెండు సినిమాల తర్వాత అర్జున్ హీరోగా తమిళ్ లో తీసిన ఓ సాంఘిక సినిమాని తెలుగులో డబ్ చేస్తూ ఇదే టైటిల్ పెట్టారు. దీంతో అర్జున్ మూడో కర్ణుడు అయ్యాడు. ఇప్పుడు 102 వ సినిమాకి బాలయ్య కర్ణ ని ఫైనలైజ్ చేస్తే గనుక ఆయన టాలీవుడ్ లో నాలుగో కర్ణుడు అవుతాడు.