మోడీ కోసం తన సీటునే వదులుకున్న వాజూభాయ్…’కర్నాటకాన్ని’ ఏమి చేస్తాడు ?

Karnataka Politics depends on Governor Vajubhai Vala Decision

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అందరి చూపు ఇప్పుడు కర్ణాటక గవర్నర్ వైపే ఉంది. కన్నడ నాట ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు హంగ్ ఏర్పడే అవకాశాలే ఎక్కువగా కనపడ్డుతున్నాయి. కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు తగిన సంఖ్యా బలం కనిపించడంలేదు కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా పైనే ఉంది. కర్ణాటక గవర్నర్ గా ఉన్న వజుభాయ్ వాలా ఎవరు అనేది అందరి మైండ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఒక్క సారి ఆయన పూర్వాపరాలు పరిశీలిస్తే ఈయన పక్కా గుజరాతీ అమిత్ షా మోడీకి చాలా సన్నిహితుడు. ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన పక్కా హిందుత్వవాది. వజుభాయ్ కి అపార అనుభవం ఉంది. 2012 నుంచి 2014 దాకా గుజరాత్ స్పీకర్ గా పనిచేశాడు. ఎమర్జెన్సీ సమయంలో 11 నెలల పాటు బీజేపీ తరఫున పోరాడి జైలుకు వెళ్లొచ్చాడు. రెండు సార్లు గుజరాత్ ఆర్థికమంత్రిగా పనిచేశాడు. 2014లో మోడీ దయతో కర్ణాటక గవర్నర్ గా నియమించబడ్డాడు. ఇప్పుడు కర్ణాటక బంతి ఈయన చేతుల్లో ఉంది.

వాజుభాయ్ వాలా పూర్వపు బీజేపీ నేత, 2001లో నరేంద్ర మోదీ కోసం తన సీటు కూడా త్యాగం చేసిన నేత ఇప్పుడు గవర్నర్ గా  మోడీకి సహాయం చేయకపోతారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ తన సంప్రదాయన్ని ఫాలో అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటు పిలవాలి. కానీ గత కొద్దిరోజులుగా ఈ సంప్రదాయాన్ని ఎవరూ పాటించడం లేదు. ఉదాహరణకి గోవా, మణిపూర్ రాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను గవర్నర్లు పిలవలేదు. కనుక ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ పాత్ర కీలకం కానుంది. నిన్న గవర్నర్‌ను కలిసేందుకు రాజ్ భవన్ వెళ్లిన కాంగ్రెస్ నేతలను కలిసేందుకు గవర్నర్ నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ నేతలు నిరాశతో వెనుదిరిగారు. కాంగ్రెస్, జేడీఎస్ మధ్య కుదిరిన ఒప్పందం గురించి గవర్నర్‌కు వివరించి కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరేందుకు కాంగ్రెస్ నాయకులు గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లారు. అయితే వారిని కలవడానికి గవర్నర్ నిరాకరించారు. అయితే వీరిని కలిసేందుకు నిరాకరించి బీజేపీ నేతలని కలవడం ఇప్పుడు మరిన్ని అనుమానాలని కలిగిస్తోంది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌(ఆరెస్సెస్) తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వాజూ భాయ్, 1971లో జన సంఘ్‌లో చేరారు. 1975లో అత్యవసర పరిస్థితుల్లో ఆయన పదకొండు నెలల జైలుశిక్ష గడిపారు. 1980లో రాజ్కోట్ మేయర్‌గా ఎన్నికయ్యారు. తరువాత ఆయన రాజ్కోట్ నుండి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి 1998 నుంచి 2012 వరకు క్యాబినెట్ మంత్రిగా ఆర్ధిక, రెవెన్యూ శాఖలకు పనిచేశారు. రెండుసార్లు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. డిసెంబరు 2012లో గుజరాత్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికై ఆగస్టు 2014 వరకు పనిచేశారు. మోడీ ప్రధాని అయ్యాక ఆయన అసీసులతో కర్ణాటక గవర్నర్ సెప్టెంబర్ 2014 లో నియమించబడ్డారు. ఈ నేపధ్యాన్ని చూశాక కరుడుగట్టిన బీజేపీ వాదిలా ఉన్న గవర్నర్ బీజేపీనే ఆహ్వానిస్తారా.? లేక మ్యాజిక్ ఫిగర్ ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ లను ఆహ్వానిస్తాడా అన్నది ఆసక్తిగా మారింది. అందుకే మరో రెండు రోజులు గడిస్తే తప్ప ఏమీ అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.