కత్తి కాంతారావును ఎవరు చూస్తారండి?

Kathi Kantha Rao Biopic movie in Nalgonda District

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్‌ల సందడి కొనసాగుతుంది. వరుసగా బయోపిక్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే ‘మహానటి’ చిత్రం విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. త్వరలోనే ఎన్టీఆర్‌ చిత్రంకు రంగం సిద్దం అవుతుంది. ఇక ఇటీవలే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే చిత్రాన్ని మొదలు పెట్టారు. అలాగే గోపీచంద్‌ పుల్లెల జీవిత చరిత్ర కూడా రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జానపద చిత్రాలకు పెట్టింది పేరు అయిన కత్తి కాంతారావు జీవిత చరిత్రను కూడా వెండి తెరపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఎన్నో చిత్రాల్లో రాజకుమారుడిగా నటించిన కత్తి కాంతారావు జీవిత చరిత్రకు ఇప్పటికే ‘అనగనగా ఓ రాజకుమారుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. పీసీ ఆధిత్య ఈ చిత్రం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ప్రస్తుతం కత్తి కాంతారావు జీవితం గురించి రీ సెర్చ్‌ చేస్తున్నాడు. ఆయన నటన ఎలా ప్రారంభం అయ్యింది, ఆయన వారసులు ఎవరు, ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవడానికి గల కారణం ఏంటీ ఇలా అనేక విషయాల గురించి ఆధిత్య తెలుసుకునే య్రత్నాలు చేస్తున్నాడు. కత్తి కాంతారావు గురించి ప్రస్తుత ప్రేక్షకులకు అస్సలు తెలియదు. ఆయన వారసులు ఉండి ఉంటే అయినా కనీసం ఆయన గురించి మాట్లాడుకునే అవకాశం ఉండేది. ఆయన జీవిత చరిత్రను తీసుకు రావాలని దర్శకుడు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. అయితే కత్తి కాంతారావు సినిమాకు కమర్షియల్‌గా సక్సెస్‌ దక్కుతుందని ఏ ఒక్కరు భావించడం లేదు. కొందరైతే నిర్మొహమాటంగా కత్తి కాంతారావు గారి సినిమాను ఎవరు చూస్తారండీ అంటూ దర్శకుడితో అనేస్తున్నారట. అయినా కూడా కత్తి కాంతారావు జీవితాన్ని అందరికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఆధిత్య ఈ నిర్ణయంను తీసుకున్నాడు.