కత్తికి పోలీసుల షాక్, నగర బహిష్కరణ… నెక్స్ట్ ఏంటి ?

Kathi Mahesh Barred From Enterring Hyderabad

గత కొద్దిరోజుల క్రితం ఒక ఛానల్ లో చర్చా కార్యక్రమంలో పాల్గొని శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. గతం నుండి చూసినా కత్తి మహేష్ ది వివాదాస్పద శైలే ఒస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదివిన కత్తి తాను ఈజీగా పాపులర్ అవడానికి పవన్ కళ్యాణ్ అనే దారిని ఎంచుకున్నాడు. పవన్ మీద నెగటివ్ వ్యాఖ్యలతో పవన్ అభిమానుల దృష్టిలో పడి బిగ్ బాస్ కి వెళ్ళేవరకూ కత్తి ప్రస్థానం సాగింది. తాను దళితుడని చెప్పుకునే కత్తి తన మీద ఎవరైనా విరుచుకుపడితే తన దళిత కార్డు వాడుకుంటూ ఉంటాడు. తాను ఎవరినయినా ప్రశ్నిస్తా అంటూ అందరి వ్యక్తిగత విషయాల మీద మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల దగ్గరకు వస్తే అది తన పర్సనల్ అంటూ తప్పించుకోవడం కత్తి నైజం.

పవన్ మొదలు, చంద్రబాబు, లోకేష్, బాలయ్యల మీద వ్యాఖ్యలు చేస్తూ సినిమాలకి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అదే విధంగా తన రాజ్యంగ హక్కు అంటూ శ్రీ రాముడి మీద తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు. అయితే దీని మీద హిందూ సంస్థల నుండి తీవ్ర ప్రతిఘటన రావడంతో నిన్న రాత్రి మహేష్‌ను అరెస్టు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు నగరం బయట విడిచిపెట్టారు. ఆయనపై నగర బహిష్కరణ వేటు వేశారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్‌లో అడుగు పెట్టవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ అనుమతి లేకుండా హైదరాబాద్‌కు రావొద్దంటూ కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. కత్తి స్వస్థలం చిత్తూరు జిల్లా కావడం వల్లనే ఆయన్ని ఏపీ పోలీస్ కి అప్పచెప్పినట్టు తెలుస్తోంది. అయితే మాట్లాడితే చానెళ్ళ స్టూడియోలకి వెళ్లి కూర్చునే కత్తి మహేష్ తదుపరి కార్యాచరణ ఏమిటా ? అనేది ప్రస్నార్ధకంగా మారింది.