కవిత మెగా ముమెంట్

kavitha Mega Moment With Megastar

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

kavitha Mega Moment With Megastar

తెలంగాణ సీఎం కేసీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అభిమాని అయితే.. ఆయన కూతురు కవిత మాత్రం చిరంజీవికి పిచ్చ ఫ్యాన్. ఈ సంగతి కవిత చాలాసార్లు చెప్పారు. రాజకీయంగా చిరంజీవితో సిద్ధాంతపరమైన విభేదాలున్నా సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ను మించిన వాళ్లు లేరన్నారు కవిత. ముఖ్యంగా చిరు డాన్స్ లకు కవిత చాలా సార్లు ఫిదా అయ్యారట.

ఉఫరాష్ట్రపతి ఎన్నికల్లో అందరు ఎంపీలు ఓటేసి వచ్చేస్తే.. కవిత మాత్రం స్పెషల్ ముమెంట్ పట్టేశారు. తన అభిమాన నటుడు చిరంజీవితో కలిసి ఓటేయడమే కాకుండా.. ఆయనతో కలిసి సెల్ఫీ దిగి ఫ్యాన్ ముమెంట్ అంటూ షేర్ చేశారు. కవిత షేర్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మెగాభిమానులు సోషల్ మీడియాలో ఈ పిక్ తో పండగ చేసుకుంటున్నారు.

రాజకీయాలు ఎలా ఉన్నా.. వ్యక్తిగత విషయాల్లో మాత్రం తాము డిఫరెంట్ టీఆర్ఎస్ నేతలు చాలాసార్లు ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. పర్సనల్ లైఫ్ వేరు, పాలిటిక్స్ వేరని కార్యకర్తలకు అగ్రనేతలు చెప్పకనే చెబుతున్నారు. మంచి వ్యక్తిగత సంబంధాలతోనే రాజకీయంగా విజయాలు సాధ్యమౌతాయని గులాబీ పార్టీ ఎప్పట్నుంచో స్కెచ్ సిద్ధం చేసింది.