కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం !

Kcr sister leelamma passed away

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసీఆర్ నాలుగో సోదరి లీలమ్మ ఈరోజు ఉదయం కన్నుమూశారు. రాజన్న సిరిసిల్ల మండలం యల్లారెడ్డిపేట్ పదిర గ్రామంలో నివసిస్తున్న కేసీఆర్ నాలుగో సోదరి లీలమ్మ గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లీలమ్మ ఈరోజు ఉదయం తన తుదిశ్వాస విడిచారు. ఈమెకు ఇద్దరు కుమారులు. అయితే సోదరి లీలమ్మ మృతి వార్త తెలిసిన వెంటనే ఢిల్లీ పర్యటనను సీఎం కేసీఆర్ మధ్యలోనే రద్దు చేసుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయి తుదిశ్వాస విడిచారు.