ఎంఎల్ఏలకు సిఎం కేసిఆర్ హెచ్చరిక

ఎంఎల్ఏలకు సిఎం కేసిఆర్ హెచ్చరిక

తెరాస పార్టీలో అసమ్మతి వర్గం మెల్ల మెల్లగా తన స్వరాన్ని వినిపిస్తుంది. ఒకరి తర్వాత ఒకరిగా పార్టీపై తమ వ్యతిరేకతను చూపిస్తున్నారు. ఆ తర్వాత ఏమైనా పైనుండి ఆదేశాలు వచ్చిన తర్వాత అదేమీ లేదు నేను ఆలా అనలేదు..కావాలనే నా మాటలను వక్రీకరించారంటూ ఒక చిన్నపాటి స్టేట్మెంట్ ఇస్తున్నారు, కానీ అప్పటికే పార్టీకి జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఆ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్స్ ఖండించిన కానీ ఎలాంటి లాభం ఉండటం లేదు.

దీనితో పార్టీకి చెందిన నేతలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా కొన్ని సున్నితమైన హెచ్చరికలు జారీచేసినట్లు తెలుస్తుంది. పార్టీ అనుమతి లేకుండా ఎలాంటి ప్రెస్ మేట్స్ పెట్టటానికి లేదని, ఎక్కడ కూడా పార్టీ పరంగా ఏమి మాట్లాడటానికి లేదని, అలాగే అసెంబ్లీ లాబీలో గతంలో మాదిరి మీడియాతో చిట్ చాట్ పెట్టటానికి లేదని, అసెంబ్లీ మీడియా పాయింట్ లో కూడా సాధ్యమైనంత వరకు మీడియాకి దూరంగా ఉండలని కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది.

అయిన ఈ రకంగా ఎమ్మెల్యేలను భయపెట్టి ఎన్ని రోజులు అని తెరాస పార్టీలో అసమ్మతి సెగని బయటకు రాకుండా ఆపగలడు. ముందు పార్టీ పరంగా చేయాలవసిన పనులు చేయటం, పార్టీలో ఏక వ్యక్తి నిర్ణయాధికారాన్ని పక్కన పెట్టటం. మంత్రులకి , సీనియర్ నేతలకి, ఎమ్మెల్యేలకి అధినేత కేసీఆర్ మధ్య అంతరాయం లేకుండా చూసుకోవటం చేయాలి. అదే విధంగా ఉద్యమ నాయకులన్నీ కాదని పార్టీ మారిన నేతలని అందలం ఎక్కించటం కూడా కొంచం తగ్గించుకుంటే మంచిది.